ఫ్యాక్ట్ చెక్: ఇతర మతస్థులు భారతదేశంలో మసీదును తగలబెట్టారంటూ జరుగుతున్న ప్రచారం నిజం కాదు
బంగ్లాదేశ్‌లోని మైనారిటీలపై దాడులు తారా స్థాయికి చేరుకున్నాయి. భారత్, బంగ్లాదేశ్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల కారణంగా
బంగ్లాదేశ్‌లోని మైనారిటీలపై దాడులు తారా స్థాయికి చేరుకున్నాయి. భారత్, బంగ్లాదేశ్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల కారణంగా భారతదేశంలోని పలు ప్రాంతాల్లో భారీ నిరసనలకు దారితీశాయి. బంగ్లాదేశ్‌లోని హిందూ దేవాలయాలపై వరుస దాడులపై భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) ఆందోళన వ్యక్తం చేసింది, బంగ్లాదేశ్ ప్రభుత్వం మైనారిటీ కమ్యూనిటీల భద్రతను కాపాడడానికి సత్వర చర్య తీసుకోవాలని పిలుపునిచ్చింది. వరుస సంఘటనల తర్వాత, బంగ్లాదేశ్‌లోని మైనారిటీలపై హింసకు సంబంధించిన అనేక సోషల్ మీడియా పోస్ట్‌లు వైరల్ అవుతూ ఉన్నాయి. వాటిలో చాలా వరకూ పాతవి కూడా ఉన్నాయి. ఎన్నో వీడియోలు తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నాయి.
భారతదేశంలో మసీదుకు నిప్పంటించారనే వాదనతో మసీదు మంటల్లో చిక్కుకున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. “আল্লাহ ভারতীয় মুসলমানদের কে রক্ষা করুন গরুর গোমূত্র খেয়ে বড় হওয়া কিছু পশু কিভাবে মসজিদে আগুন দিল” అంటూ బెంగాలీలో పోస్టును వైరల్ చేస్తున్నారు. “భారత ముస్లింలను అల్లా రక్షించుగాక. ఆవు మూత్రం తాగుతూ పెరిగిన కొన్ని జంతువులు మసీదుకు నిప్పు పెట్టాయి” అనే అర్థం వచ్చేలా పోస్టులు పెట్టారు.
క్లెయిం ఆర్కైవ్ లింక్ ను ఇక్కడ చూడొచ్చు.
ఫ్యాక్ట్ చెకింగ్:
Pos-Kupang.com అనే ఛానెల్ ప్రచురించిన వీడియోలోని వివరణ ప్రకారం "లువుక్ బంగాయ్ సెంట్రల్ మార్కెట్‌లోని డజన్ల కొద్దీ స్టాల్స్‌ను కాలిపోయాయి" అనే శీర్షికతో, సెంట్రల్ సులవేసిలోని బంగాయ్ రీజెన్సీలోని లువుక్ సెంట్రల్ మార్కెట్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించిందని వివరించారు. ఆదివారం (8/12/2024) ఉదయం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. లువుక్ సెంట్రల్ మార్కెట్ పక్కనే ఉన్న మసీదుకు మంటలు వ్యాపించాయి. మసీదు, దాని చుట్టూ ఉన్న డజన్ల కొద్దీ దుకాణాలు కాలిపోయాయి. చాలా రద్దీగా ఉండే మార్కెట్ లో మంటలు వేగంగా వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది గంటల తరబడి శ్రమించి ఎట్టకేలకు మంటలను ఆర్పివేశారు. లువుక్ సెంట్రల్ మార్కెట్‌లోని దాదాపు అన్ని భవనాలు కాలిపోయినట్లు సమాచారం. అగ్నిప్రమాదానికి గల కారణాలపై అధికారులు ఆరా తీయడమే కాకుండా, వ్యాపారులకు జరిగిన మొత్తం నష్టాలను లెక్కగట్టారు. (POS-KUPANG.COM, TribunPalu.com)
ఇంకో ఇండొనీషియన్ న్యూస్ వెబ్సైట్ లో వచ్చిన వార్తా కధనం ప్రకారం, బంగై రీజెన్సీలోని లువుక్ సెంట్రల్ మార్కెట్‌లో జరిగిన అగ్నిప్రమాదానికి 24 గంటల తర్వాత కూడా ఖచ్చితమైన కారణం తెలియరాలేదు.అయినప్పటికీ, ఇండోనేషియా ఆటోమేటిక్ ఫింగర్‌ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ బృందం బంగాయ్ పోలీస్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ ఆదివారం, డిసెంబర్ 8, 2024 మధ్యాహ్నం లువుక్ సెంట్రల్ మార్కెట్‌లో ప్రాథమిక నేర పరిశోధనను నిర్వహించింది.లువుక్ సెంట్రల్ మార్కెట్ వద్ద జరిగిన అగ్ని ప్రమాదంలో లాస్, పెటాక్ భవనాలు, అల్-ఇఖ్సాన్ మసీదు దగ్ధమయ్యాయి.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now