ఫ్యాక్ట్ చెక్: రోహిత్ శర్మ.. రిషబ్ పంత్ ను కలిసి అతడికి తన రక్తాన్ని ఇవ్వలేదు..!
భారత స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ కు ఇటీవల యాక్సిడెంట్ అయిన సంగతి తెలిసిందే..! డెహ్రాడూన్ లోని మ్యాక్స్ ఆసుపత్రి నుండి పంత్ ను ముంబై ఆసుపత్రికి తరలించారు. రిషబ్ పంత్ ఆరోగ్యం నిలకడగా ఉంది. రిషబ్ పంత్ త్వరగా కోలుకోవాలని పలువురు ఆకాంక్షిస్తూ వస్తున్నారు.

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ పంత్ కు రక్తం ఇచ్చాడని చెబుతూ ఓ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. రోహిత్ శర్మ తన కుమార్తె పుట్టినరోజు పార్టీకి కూడా హాజరవ్వలేదని.. కారు ప్రమాదంలో గాయపడిన రిషబ్ పంత్‌కు రక్తదానం చేయడానికి మాల్దీవుల నుండి భారత్ కు తిరిగి వచ్చాడంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వైరల్ అవుతోంది.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న పోస్టులో ఎటువంటి నిజం లేదు.
మేము రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసాము. వైరల్ ఫోటోకు సంబంధించి హిందుస్థాన్ టైమ్స్ కథనాన్ని కనుగొన్నాము, అక్టోబర్ 2016లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ గాయపడటంతో లండన్‌లో తొడకు శస్త్రచికిత్స చేయించుకున్నప్పటి చిత్రం.
నవంబర్ 11, 2016న క్రికెటర్ తన ట్విట్టర్‌లో ట్వీట్ చేసిన ఒరిజినల్ చిత్రాన్ని కూడా మేము గుర్తించాం.
పలు మీడియా సంస్థలు ఇదే విషయానికి సంబంధించిన కథనాలను పబ్లిష్ చేశాయి.
https://www.indiatoday.in/sports/cricket/story/rohit-sharma-india-new-zealand-india-england-thigh-injury- 351649-2016-11-12
https://indianexpress.com/article/sports/cricket/rohit-sharma-undergoes-successful-thigh-surgery-london-4371140/
రోహిత్ శర్మ.. రిషబ్ పంత్ కు యాక్సిడెంట్ అయిందని తెలియగానే వైద్యులతో మాట్లాడాడు. డిసెంబర్ 31, 2022 నాటి నివేదికలో కూడా ఆ విషయం గురించి మేము కనుగొన్నాము, “భారత జట్టు కెప్టెన్, ప్రస్తుతం మాల్దీవులలో ఉన్న రోహిత్ శర్మ రిషబ్ పంత్‌కు చికిత్స చేస్తున్న వైద్యులతో మాట్లాడారు. ఇతర సహచరులందరూ రిషబ్ ఆరోగ్య పరిస్థితులపై తెలుసుకోడానికి అతని కుటుంబాన్ని, మేనేజర్‌ను సంప్రదించారు. డిసెంబర్ 30న సోషల్ మీడియాలో పోస్టు చేసిన వైరల్ పోస్టులకు ఇది విరుద్ధం.
కాబట్టి, వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు. రోహిత్ శర్మ మాల్దీవుల నుండి వచ్చేసి రిషబ్ పంత్ కు బ్లడ్ డొనేషన్ చేయలేదు.
https://www.indiatoday.in/
https://indianexpress.com/

Claim : Rohit Sharma missed his daughter’s birthday party, and returned from Maldives to donate blood to Rishabh Pant after his car accident.
Claimed By : Social Media Users
Fact Check : False