ఫ్యాక్ట్ చెక్: కుక్క, కుక్క పిల్లలు బురదలో కూరుకుపోయిన వీడియో వాయనాడ్ లో జరిగింది కాదు
కేరళలోని వాయనాడ్‌లో కొండచరియలు విరిగిపడటంతో 300 మందికి పైగా మరణించారు. చాలా మంది ఆచూకీ ఇంకా దొరకలేదు. భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయి. నిరంతరంగా హెచ్చరికలు చేస్తున్నా కూడా అనుమతులు లేకుండా నిర్మాణాలు, టూరిస్ట్ రిసార్ట్‌లు, అనుసంధాన రహదారులు, సొరంగాలు, క్వారీ కార్యకలాపాలు కొనసాగుతున్నాయని కూడా పలువురు నివేదించారు.
కేరళలోని వాయనాడ్‌లో కొండచరియలు విరిగిపడటంతో 300 మందికి పైగా మరణించారు. చాలా మంది ఆచూకీ ఇంకా దొరకలేదు. భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయి. నిరంతరంగా హెచ్చరికలు చేస్తున్నా కూడా అనుమతులు లేకుండా నిర్మాణాలు, టూరిస్ట్ రిసార్ట్‌లు, అనుసంధాన రహదారులు, సొరంగాలు, క్వారీ కార్యకలాపాలు కొనసాగుతున్నాయని కూడా పలువురు నివేదించారు.
వాయనాడ్ కు సంబంధించిన విజువల్స్ ను చూసి అందరూ షాక్ అవుతూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో.. బురదలో కూరుకుపోయిన కుక్కకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. కొండచరియలు విరిగిపడిన ఘటనలో కుక్క, దాని రెండు కుక్కపిల్లలతో పాటు బురదలో కూరుకుపోయిందని.. వాటిని రెస్క్యూ టీమ్ రక్షించిందని సోషల్ మీడియా యూజర్లు తెలిపారు.
“రెస్క్యూ టీమ్‌కి బిగ్ సెల్యూట్....కేరళలోని వాయనాడ్‌లో కొండచరియలు విరిగిపడటంతో ఒక కుక్క, రెండు కుక్కపిల్లలను రక్షించారు” అనే శీర్షికతో వీడియోను షేర్ చేస్తున్నారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదారి పట్టించేది. ఈ వీడియో కేరళకు చెందినది అయినప్పటికీ ఇది ఇటీవలిది కాదు. వాయనాడ్ లో కొండచరియలు విరిగిపడిన సమయంలో కుక్కను రక్షించిన సంఘటన గురించి ఎలాంటి నివేదికలు మాకు కనిపించలేదు. వైరల్ వీడియో నుండి సంగ్రహించిన కీఫ్రేమ్‌లను తీసుకుని Google రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేశాం. అక్టోబర్ 2023లో ప్రచురించిన మేము కనుగొన్నాము. Reddit పోస్ట్‌ని
Newsflare.com వెబ్‌సైట్‌లో ఇందుకు సంబంధించిన కథనం కూడా కనిపించింది. వెబ్‌సైట్ ప్రకారం.. ఈ వీడియో అక్టోబర్ 15, 2021న భారతదేశంలోని పాలక్కాడ్‌లోని జాతీయ రహదారి 966 దగ్గరలో రికార్డు చేశారు. “ఇటీవల దక్షిణ భారత రాష్ట్రమైన కేరళలో కొండచరియలు విరిగిపడటంతో ఒక కుక్క, రెండు కుక్కపిల్లలు రక్షించారు. రెండు రోజుల ముందు భారీ వర్షాల కారణంగా కొండల ప్రాంతంలోని భూమి కొట్టుకుపోయింది. అక్టోబర్ 15 న పాలక్కాడ్ జిల్లాలోని ఒక దుకాణం వెనుక తల్లి కుక్క తన మెడ వరకు చిక్కుకుపోయిందని స్థానికులు కనుగొన్నారు. జంతు సంరక్షకులు సంఘటనా స్థలానికి చేరుకుని తల్లి కుక్కని కాపాడడానికి చుట్టూ తవ్వారు. ఆ తర్వాత సమీపంలోని బురదలో రెండు కుక్క పిల్లలను కూడా రెస్క్యూ అధికారులు గుర్తించారు. రెండు రోజులుగా ఆహారం, నీరు లేకుండా కుక్కలు అక్కడ చిక్కుకుపోయి ఉంటాయని స్థానికులు భావించారు. సంరక్షకుల దగ్గర అవి పూర్తిగా కోలుకుంటున్నాయి" అని కథనంలో చెప్పారు.
ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రచురించిన కథనం ప్రకారం, పాలక్కాడ్-మలప్పురం సరిహద్దులోని కుమారనెల్లూరు సమీపంలోని కంజిరథాని వద్ద భారీ వర్షాల కారణంగా భారీగా మట్టి కూడా కొట్టుకువచ్చింది. ఓ దుకాణం వెనుక బురదలో కూరుకుపోయి ఉన్న ఒక కుక్క, రెండు పిల్లలను స్థానికులు రక్షించారు.
న్యూస్ మినిట్ ప్రకారం.. పాలక్కాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడటంతో కుక్క, రెండు కుక్కపిల్లలు బురదలో కూరుకుపోయాయి. కుమారనెల్లూరు కంజిరథాని సమీపంలోని పాలక్కాడ్-మలప్పురం జిల్లా సరిహద్దు గ్రామంలో కొండచరియలు విరిగిపడ్డాయని.. మూడు రోజుల తర్వాత వాటిని రక్షించారు. కుక్కలను బురదలో నుంచి బయటకు తీయడానికి స్థానికులు జంతు సంరక్షకుల సహాయం తీసుకున్నారు.
వైరల్ వీడియోలో వాయనాడ్ లో కొండచరియలు విరిగిపడిన తర్వాత ఇరుక్కుపోయిన కుక్కను చూపించలేదు. ఈ సంఘటన అక్టోబర్ 2021లో కేరళలోని పాలక్కాడ్‌లో జరిగింది. వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదారి పట్టించేది.
Claim : వాయనాడ్ లో కొండచరియలు విరిగి పడిన ఘటనలో ఒక కుక్క, రెండు కుక్కపిల్లలను రక్షించారు
Claimed By : Social media users
Fact Check : False