Coriander : కొత్తిమీర ఇచ్చే ప్రయోజనాలు అన్నీఇన్నీ కావట.. వాళ్లు మాత్రం కొత్తిమీర తినకూడదట

ఆకుకూరల్లో కొత్తి మీరకు ఉన్న ప్రత్యేకత మరి దేనికీ ఉండదు. కొత్తిమీర లేకుండా వంటలుండవు.;

Update: 2025-04-02 08:00 GMT
coriander, health tips,  green vegitables summer
  • whatsapp icon

ఆకుకూరల్లో కొత్తి మీరకు ఉన్న ప్రత్యేకత మరి దేనికీ ఉండదు. కొత్తిమీర లేకుండా వంటలుండవు. కొత్తిమీర వేస్తేనే ఏ కూరకైనా టేస్టువస్తుంది. దాని సువాసన తగిలితే చాలు కడుపులో ఆకలి బయలుదేరుతుంది. అలాంటి కొతిమీరను వాడినందున అనేకప్రయోజనాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. అదే సమయంలో కొందరు మాత్రం కొత్తిమీరకు దూరంగా ఉండాలని చెబుతున్నారు. థనియాల నుంచి వచ్చే కొత్తిమీర మన భారతీయ వంటకాల్లో ఎంతో విశిష్టతను చాటుకుంది. రుచి కూడా అదిరిపోతుంది. అంతే కాదు దాని వాసన ముక్కుపుటాలకు సోకితే చాలు ఆకలి మరింత పెరుగుతుంది.

అజీర్ణం మటు మాయం...
కొత్తిమీర ను కషాయంగా చేసి పాలు మరియు పంచదార కలిపి ఇస్తే నెత్తురు పడే మూలశంక వంటి రోగాలు కూడా మాయమవుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అజీర్ణ విరేచనాలు , కడుపులో మంట తగ్గడం , గ్యాస్ సమస్య, అజీర్ణం వంటి సమస్యలకు మంచి ఔషధంగా పనిచేస్తుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. కొత్తిమీర శరీరంలో మూడు దోషాల పైన పనిచేస్తుందని, దాహం ఎక్కువ అయ్యే సమస్యని పోగొడుతుందని, కొత్తిమీర మంచిగా అరుగుదలకు కారణమై జీర్ణ వ్యవస్థపై ప్రభావంచూపుతుందని వైద్యులు చెబుతున్నారు.
నేత్ర వ్యాధులు...
కొత్తిమీర రసాన్ని చనుపాలతో కలిపి కళ్లలో వేస్తే నేత్రరోగాలు నయం అవుతాయంటారు.లేకపోతే కొత్తిమీరను వెచ్చచేసి కళ్ళకి వేసి కట్టినా సమస్య తీరుతుందని చెబుతారు. కొత్తిమీర కషాయంలో పంచదార కలిపి పుచ్చుకుంటే బాగా ఆకలి అవుతుందని అంటారు. పురాతనకాలంలో కొన్ని తెగలవారు ప్రసవించే స్త్రీ దగ్గర ఈ కొత్తిమీర ఉంచితే వారు తొందరగా ప్రసవిస్తారు అని ఒక నమ్మకం ఉండేది. ప్రసవింవించిన వెంటనే అక్కడ నుంచి కొత్తిమీర తీసివేస్తారట. * నోరు పూసి ఉన్నప్పుడు కొత్తిమీర రసంతో పుక్కిలిస్తే అద్భుతంగా పనిచేస్తుందని కూడా వైద్యులు చెబుతున్నారు.
కొత్తి మీర పచ్చడితో...
కొత్తిమీరతో కూర వండుకుని తినటం మరియు దీనిని కూరల్లో వాడటం వలన మూత్ర విసర్జన సులువుగా జరుగుతుందని వైద్యులు చెబుతారు. దీనిని తరచుగా తీసుకోవడం వలన మెదడులో వేడిని కూడా తగ్గిస్తుందని అంటారు. కొత్తిమీర ఆకు అవునేయ్యితో వేయించి కొంచం కనురెప్పలు మూసుకొని కనులపై వేసి కట్టిన నేత్రసమస్యలు నివారణకు ఎంతో ఉపయోగపడుతుందని అంటారు. కొత్తిమీర కారం చేసుకుని తినొచ్చు. కొత్తిమీర ఆకులని , పచ్చిమిరపకాయలనితొక్కి తగినంత ఉప్పువేసి అందులో నిమ్మకాయ రసం చేర్చి చేసిన పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. దీనిని తీసుకోవడం వలన శరీరంలో పైత్యం తగ్గుతుంది. అయితే గ్రహణ రోగం తో భాధపడేవారు ఈ కొత్తిమీరని ఎట్టి పరిస్థితుల్లో వాడరాదని కూడా ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు.


Tags:    

Similar News