Tamarind Leaves : వేసవిలో దొరికే చింత చిగురు.. పుల్లన.. దీనిని ఎవరు తినకూడదో తెలుసా?

వేసవి కాలం వచ్చేసింది. ఈ కాలంలో చింత చిగురు ఎక్కువగా లభిస్తుంది.;

Update: 2025-03-21 04:39 GMT
summer, tamarind leaves, health, doctors
  • whatsapp icon

వేసవి కాలం వచ్చేసింది. ఈ కాలంలో చింత చిగురు ఎక్కువగా లభిస్తుంది. ఈ వేసవిలో దొరికే చింత చిగురును తింటే మంచిదని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. ఎండాకాలంలో మాత్రమే లభించే చింత చిగురువల్ల ఆరోగ్యపరంగా ఎంతో మేలు చేకూరడంతో పాటు ప్రయోజనాలు కూడా లభిస్తాయని చెబుతున్నారు.చింత చిగురును పప్పుగా, కూరగా , పచ్చడిగా ఎక్కవగా ఉపయోగిస్తారు . దీని లేత చిగురుని చింతచిగురు అంటారు. ఈ చింతచిగురు గుండెకు ఎంతో మేలు చేస్తుందని తెలిపారు. గుండె సంబంధిత వ్యాధులున్న వారు దీనిని తినడం వల్ల అనేక ప్రయోజనాలున్నాయని వైద్యులు కూడా చెబుతున్నారు.

రుచి మాత్రం అమోఘం...
చింత చిగురు ఇది వగరు మరియు పులుపు రసాలని కలిగి ఉంటుంది. రుచిని మాత్రం అమోఘంగా ఉంటుంది. జీర్ణక్రియకు మేలు చేస్తుందని ఆయుర్వేద వైద్యులు తెలిపారు. కఫ మరియు వాతాలని అద్భుతంగా నిర్మూలిస్తుందని తెలిపారు. * చింతచిగురు ఎక్కువుగా వేసవికాలంలోనే దొరకుతుంది. కాని ఒక ప్రక్రియ ద్వారా అకాలంలో కూడా చింతచిగురు పొందే అవకాశం ఉన్నా అది అంత రుచిగా ఉండదని, ఈ వేసవిలో దొరికే చింతచిగురులో రుచితో పాటు ఆరోగ్య పరమైన లక్షణాలు కూడా అధికంగా ఉంటాయని వైద్యులు పేర్కొంటున్నారు.
వేడి చేస్తుందని...
చింతచిగురు శరీరానికి వేడిచేస్తుందని అందరూ భావిస్తారు. కాని వేసవికాలంలో దీనిని తినడం వలన ఒక మంచిగుణం ఉంది. వేసవిలో చెమట విస్తారంగా పడుతుందని, చింతచిగురు తరచుగా ఉపయోగిస్తే చెమట అంత ఎక్కువుగా పట్టదని వైద్యులు చెబుతున్నారు. చింతచిగురు వాత వ్యాధులని , మూలరోగాన్ని , శరీరంలో ఏర్పడే గుల్మములను తగ్గిస్తుందని కూడా చెబుతున్నారు. పైత్యం , వికారం వంటివి కూడా తగ్గిస్తుందని అంటున్నారు. కొన్ని ప్రాంతాలతో ముదురు చింతాకుని ఎండబెట్టి చింతపండుకి బదులుగా వాడతారు. ఎండబెట్టిన ముదురు చింతాకును పొడిచేసి పుల్లకూరగా వండవచ్చు . ఒంగోలు ఏరియాలో దీనికి ప్రాముఖ్యత ఎక్కువగా ఉంటుంది. అయితే కంటి సంబంధిత వ్యాధులు కలవారు దీన్ని అధికంగా తినకూడదని వైద్యులు చెబుతున్నారు.


Tags:    

Similar News