Curry Leaves : కరివేపాకు ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా? ఏరిపాకేయండి.. నమిలేయండిక
కరివేపాకు తిన్నందున అనేక వ్యాధులు దూరమవుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు
కరివేపాకును కూరల్లో వేసుకుంటాం. కానీ దానిని తీసి అవతల పారేస్తాం. కేవలం సువాసన కోసమే కరివేపాకును వంటల్లో వేస్తారని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. కానీ దానిని తింటే అంతకు మించిన ఆరోగ్యం మరొకటి లేదని, సర్వరోగ నివారిణిగా వైద్యులు చెబుతున్నారు. ఆకు కూరల్లో కరివేపాకు కు ఉన్న ప్రాధాన్యత మరే ఆకుకు లేదు. మంచి సువాసనలు వెదజల్లే ఈ కరివేపాకుతో అనేక రకాలుగా వంటలు తయారు చేసుకుని ఆహారంగా తీసుకోవచ్చని చెబుతున్నారు. కరివేపాకు తిన్నందున అనేక వ్యాధులు దూరమవుతాయని కూడా చెబుతున్నారు.
ఈ వ్యాధులకు...
కరివేపాకు మన ఆహారంలో భాగం చేసుకోవడం కారణంగా శరీరంలో కఫం మరియు వాతాన్ని పోగొడుతుంది. దీనిని ప్రతిరోజు జీర్ణం అవ్వడమే కాకుండా మలబద్ధకం కూడా ఉండదని వైద్యులు చెబుతున్నారు. అంతేకాదుఈ కరివేపాకు ముద్ద చేసి విష జంతువుల కాట్లకు మరియు దద్దుర్లకు కూడా ఉపయోగిస్తారని ఆయుర్వేద వైద్య నిపుణులు చెబుతున్నారు. కరివేపాకు ఆకుల కషాయం తీసుకోవడం ద్వారా కలరా వ్యాదిని కూడా నివారించే అవకాశం ఉంటుందని సూచిస్తున్నారు.
ఇలా తింటే...
కరివేపాకు , మినపప్పు, మిరపకాయలు కలిపి నేతిలో వేయించి రోటిలో నూరి దాంట్లో కొంచం ఉప్పు వేసి నిమ్మకాయ రసం పిండి తయారుచేసే కారానికి కరివేపాకు కారం అంటారు. ఈ పచ్చడి శరీరంలో పైత్యాన్ని తగ్గించి నోటికి మంచి రుచి లభిస్తుంది. కరివేపాకు తక్కువ ధరకే లభిస్తుంది. పెద్దగా ఖర్చు లేకుండానే మన ఆరోగ్యాన్ని కాపాడుకునే వీలుంది. ఆకుకూరల్లో కింగ్ కరివేపాకు అని వైద్యులు చెబుతున్నారు. అలాంటి కరివేపాకును వంటల్లో వేసినా తీసిపారేయకుండా దానిని తింటే మంచి ఆరోగ్యం లభిస్తుందన్నది వైద్యుల సూచన. ఇది ఆయుర్వేద వైద్యులు అందించిన సూచన మాత్రమే. వైద్య నిపుణులు కూడా కరివేపాకు ఒంటికి మంచిదని చెబుతున్నారు.