Ghee vs Butter: నెయ్యి- వెన్న ఆరోగ్యానికి ఏది మంచిది? నిపుణులు చెబుతున్నదేంటి?

మంచి రుచి కోసం, ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చాలా మంది తరచుగా నెయ్యి , వెన్న

Update: 2024-09-13 14:26 GMT

Ghee vs Butter

మంచి రుచి కోసం, ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చాలా మంది తరచుగా నెయ్యి , వెన్న తినాలని సిఫార్సు చేస్తారు. ఈ రెండు కూడా భారతీయ వంటకాల్లో ఎక్కువ వినియోగిస్తుంటారు. ఈ రెండింటిలోనూ వాటి ఎన్నో పోషకాలు ఉన్నాయని పోషక నిపుణులు చెబుతున్నారు. ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అయినప్పటికీ ఆరోగ్య కోణం నుంచి మాట్లాడినట్లయితే నెయ్యి, వెన్న ఈ రెండింటిలో ఏది మంచిదనే సందేహం చాలా మందిలో వస్తుంటుంది. పరీక్షలు, ఫిట్‌నెస్‌ని నిర్వహించడానికి మీరు కూడా ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలనుకుంటే USAకు చెందిన ఎండీ హెమటాలజిస్ట్-ఆంకాలజిస్ట్ డాక్టర్ రవి కె. గుప్తా తెలిపిన విషయాలను తెలుసుకోవాల్సిందే. డాక్టర్ రవి కె గుప్తా తన ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోను పంచుకోవడం ద్వారా ఈ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.

నెయ్యి- వెన్న మధ్య తేడా ఏమిటి?

నెయ్యి - వెన్న రెండూ పోషకాహారాలు. వీటిని పవన్‌ హౌస్‌లుగా పరిగణిస్తారు. వెన్న కరిగించడం ద్వారా నెయ్యి తయారవుతుంది. అలాగే ఈ రెండు వస్తువులను పాలతో తయారు చేస్తారు. నెయ్యి, వెన్న రెండింటిలో విటమిన్ ఎ, విటమిన్ ఇ, ఫాస్పరస్, కాల్షియం, యాంటీ ఆక్సిడెంట్ ఎలిమెంట్స్ వంటి ముఖ్యమైన పోషకాలు ఉన్నాయి. ఇవి ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి.

ఈ రెండింటిలో ఏది ఎక్కువ ఆరోగ్యానికి మంచిది?

ఒక చెంచా నెయ్యిలో 125 కేలరీలు ఉంటే ఒక చెంచా వెన్నలో 100 కేలరీలు ఉంటాయని డాక్టర్ రవి కె గుప్తా చెబుతున్నారు. నెయ్యిలో పాలీఅన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ (PUFAs) వంటి ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇవి మీ శరీరానికి HDL కొలెస్ట్రాల్‌కు (అధిక సాంద్రత కలిగిన లిపోప్రొటీన్) సహాయపడే మెదడు పనితీరు, కణాల పెరుగుదలకు తోడ్పడతాయి. మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. కానీ వెన్న మీ చెడు కొలెస్ట్రాల్ అంటే తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ (LDL) కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది.

నెయ్యి లాక్టోస్ రహితమైనది. సులభంగా జీర్ణమవుతుంది. అయితే వెన్నలో లాక్టోస్ నిండి ఉంటుంది. జీర్ణం కావడం కష్టం. నెయ్యి అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. రోజువారీ వంటలలో ఉపయోగించడం సులభం.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాల మేరకు అందిస్తున్నాము. ఏవైనా సందేహాలు ఉంటే వారిని సంప్రదించాలని సూచిస్తున్నాము.)

Tags:    

Similar News