Kerala : కేరళ వెళ్తున్నారా? అయితే జాగ్రత్త... వైరస్‌లున్నాయ్ అలెర్ట్‌గా ఉండాల్సిందే

మంకీ పాక్స్ వణికిస్తుంది. దీంతో సరిహద్దు రాష్ట్రాలు కూడా అప్రమత్తమయ్యాయి. నిఫా వైరస్ ను కూడా గుర్తించారు.

Update: 2024-09-20 12:37 GMT

కేరళ పర్యాటక రంగానికి పెట్టింది. కేరళలో చూడాల్సిన అనేక ప్రదేశాలున్నాయి. అక్కడి వాతావరణం ఎంత బాగుంటుందో అక్కడి వెళ్లిన వారికి తప్ప వేరే వారికి తెలియదు. ఇతర దేశాల నుంచి రాష్ట్రాల నుంచి కూడా కేరళకు పర్యాటకుల సంఖ్య నిత్యం వేల సంఖ్యలోనే ఉంటుంది. కేరళను దేవభూమిగా కూడా పిలుస్తారు. అక్కడి ప్రదేశాలను చూసేందుకు వీలు కుదుర్చుకుని మరీ ఎంతో వ్యయానికి ఓర్చి మరీ పర్యాటకులు వస్తుంటారు. కేరళకు అత్యధిక ఆదాయం తెచ్చిపెట్టేది పర్యాటక రంగం నుంచే. అయితే కేరళలో వరసగా వైరస్ వ్యాప్తిలు కలవరం రేపుతున్నాయి. నైరుతి రుతు పవనాలు కేరళను ముందు తాకినట్లుగానే ప్రతి వైరస్ ముందుగా కేరళను టచ్ చేస్తుందన్న కామెంట్స్ కూడా వినపడుతున్నాయి.

మంకీపాక్స్ సోకి...
తాజాగా కేరళలో మంకీ పాక్స్ వణికిస్తుంది. దీంతో సరిహద్దు రాష్ట్రాలు కూడా అప్రమత్తమయ్యాయి. ఒకే వ్యక్తిలో మంకీపాక్స్ తో పాటు నిఫా వైరస్ ను కూడా వైద్యులు గుర్తించడంతో కేరళ ప్రభుత్వం అలెర్ట్ అయింది. కేరళ సరిహద్దు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటకల్లోనూ హై అలెర్ట్ ను ప్రకటించాయి.తమ బోర్డల్ లో తనిఖీలు చేస్తున్నాయి. కేరళలోని మలప్పురం జిల్లాకు చెందిన ఒక వ్యక్తి మంకీపాక్స్‌ లక్షణాలతో ఆస్పత్రిలో చేరారు. మంజేరీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అతని శాంపిల్స్‌ను కోజికోడ్‌ వైరాలజీ ల్యాబ్‌కు పంపగా.. పాజిటివ్‌గా తేలిందని వైద్య శాఖ అధికారులు చెబుతున్నారు. కేరళలో రెండో మంకీపాక్స్ నమోదయింది.
నిఫా వైరస్ కూడా...
అయితే మంకీపాక్స్ సోకిన వ్యక్తితో సంబంధం ఉన్న వారిని కూడా కేరళ ప్రభుత్వం గుర్తించి వారిని ఐసొలేషన్ కు తరలించి చికిత్స ను అందిస్తుంది. ఈ నెల 9వ తేదీన మంకీపాక్స్ కేసు నమోదు కాగా, మరో వైపు నిఫా వైరస్ కూడా కేరళను కుదిపేస్తుంది. ఒక వ్యక్తికి నిఫా వైరస్ సోకడంతో అతనిని కలసిన దాదాపు మూడు వందల మంది వరకూ ఐసోలేషన్‌కు తరలించింది. కేరళకు ఎక్కువ మంది విదేశాల నుంచి వస్తుండటం వల్లనే వైరస్ లు ఎక్కువగా వస్తున్నాయని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కేరళ నుంచి వస్తున్న వారిని పూర్తిగా వైద్యపరీక్షలు నిర్వహించిన తర్వాత మాత్రమే రాష్ట్రంలోకి అనుమతిస్తున్నారు. ఇందుకోసం నాగర్‌కోయిల్ లో ప్రత్యేకంగా మెడికల్ క్యాంప్స్ ను ఏర్పాటు చేస్తున్నారు. కేరళ నుంచి వచ్చే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. కేరళ వెళ్లే వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్న సూచనలు వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు.


Tags:    

Similar News