Vaccine: గుడ్ న్యూస్.. మంకీ పాక్స్ కు వ్యాక్సిన్ వచ్చేసింది

Update: 2024-09-14 02:26 GMT

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) మంకీ పాక్స్ కు వ్యాక్సిన్ ను తీసుకొచ్చినట్లు చెప్పింది. మంకీ పాక్స్ పై పోరాడడానికి MVA-BN వ్యాక్సిన్‌ను దాని ప్రీక్వాలిఫికేషన్ జాబితాలో చేర్చారు. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ MVA-BN వ్యాక్సిన్‌ని మొదటి మంకీ పాక్స్ టీకాగా ప్రకటించింది. అత్యవసర సమయాల్లో ఈ వ్యాక్సిన్ ను ఉపయోగించాలని సూచించారు. ఆఫ్రికాలో Mpox వ్యాప్తిని నియంత్రించే ప్రయత్నంలో, ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) యునైటెడ్ స్టేట్స్‌లో జిన్నెయోస్ అని పిలువబడే బవేరియన్ నార్డిక్ టీకాను ఆమోదించింది.

తయారీదారు బవేరియన్ నార్డిక్ సమర్పించిన సమాచారం ప్రకారం యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ ఈ వ్యాక్సిన్ పై సమీక్ష చేసింది. WHO డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ మాట్లాడుతూ ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి రావడం ఆఫ్రికాలో మంకీ పాక్స్ వ్యాప్తిని అరికట్టడంలో కీలకమైన దశ అని చెప్పారు. MVA-BN టీకా, నాలుగు వారాల వ్యవధిలో రెండు-డోస్ లతో కూడిన ఇంజెక్షన్‌. ఇది 18 ఏళ్లు పైబడిన వారికి ఇవ్వడానికి ఆమోదం పొందింది. చల్లని పరిస్థితుల్లో నిల్వ చేయాల్సి ఉంటుంది. ఇది ఎనిమిది వారాల వరకు 2 నుండి 8 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రతల వద్ద స్థిరంగా ఉంటుంది. సింగిల్-డోస్ MVA-BN వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత mpox నుండి ప్రజలను రక్షించడంలో 76 శాతం ప్రభావాన్ని కలిగి ఉంటుంది. రెండు-డోస్ లు తీసుకున్న తర్వాత మంకీ పాక్స్ నుండి 82 శాతం ప్రభావాన్ని సాధిస్తుందని WHO తెలిపింది.


Tags:    

Similar News