New Covid Variant XEC : మరో వైరస్ దూసుకొస్తుంది... మాస్క్‌లు,శానిటైజర్లు సిద్ధం చేసుకోండిక

కరోనా వైరస్ లో మరో వేరియంట్ వేగంగా విస్తరిస్తుంది. అయితే ప్రస్తుతం ఇది ఐరోపా దేశాలలో ఈ వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది

Update: 2024-09-18 07:08 GMT

 New Covid Variant XEC

కరోనా వైరస్ లో మరో వేరియంట్ వేగంగా విస్తరిస్తుంది. అయితే ప్రస్తుతం ఇది ఐరోపా దేశాలలో ఈ వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది. దీనీని XEC వేరియంట్ గా గుర్తించారు. ఈ కొత్త వేరియంట్ ను తొలుత జర్మనీలో గుర్తించారు. ఇది ఒమిక్రాన్ సబ్ వేరియంట్ అని వైద్యనిపుణులు చెబుతున్నారు. అత్యంత వేగంగా విస్తరించే ఈ వేరియంట్ తో ప్రాణాలకు కూడా ముప్పు ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం ఐరపా దేశాల్లో వేగంగా విస్తరిస్తున్న ఈ కొత్త వైరస్ వేరియంట్ ఇప్పటి వరకూ పదమూడు దేశాలకు విస్తరించిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతుంది. మిగిలిన దేశాలు కూడా అప్రమత్తంగా ఉండాలని కోరింది.

ఈ దేశాల్లో...
ఇది కరోనా వైరస్ లోని ఒమిక్రాన్ సబ్ వేరియంట్ గా చెబుతున్నారు. KS.1.1, KP.3.3ల కలయికగా దీనిని ఇప్పటికే వైద్యులు గుర్తించారు. ఈ వేరియంట్ ఎక్కువ కేసుల పెరగడానికి దోహదం చేస్తుందని భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రజలు విధిగా మాస్క్‌లను ధరిస్తూ భౌతిక దూరాలను పాటిస్తూ, శానిటైజర్ల వాడకాన్ని మరింత పెంచాలంటూ ఇప్పటికే ఐరోపా దేశాల్లో ప్రభుత్వాలు ప్రజలకు ఆదేశాలు జారీ చేశాయి. ఏమాత్రం అనారోగ్యం పాలయినా వెంటనే వైద్యులను సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఏ మాత్రం అశ్రద్ధ చేసినా మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిస్తున్నారు.
ఇండియా కూడా అప్రమత్తం కావాల్సిందేనా?
ఈ వైరస్ అత్యంత వేగంగా విస్తరిస్తుందని తేలడంతో అన్ని దేశాలు ఇప్పటికే అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే ఐరోపా దేశాల్లో దీనికి సంబంధించి పరిశోధనలు కూడా ప్రారంభమయ్యాయని చెబుతున్నారు. ప్రజలు ఈ వైరస్ బారిన పడకుండా ముందు జాగ్రత్తచర్యగా వ్యాక్సిన్ లను కూడా అందించే ప్రక్రియను చేపట్టిందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజన్ చెప్పింది. ఇప్పటికే ఈ కొత్తవేరియంట్ డెన్మార్క్, జర్మనీ, నెదర్లాండ్స్ దేశాలలో వేగంగా విస్తరిస్తుందని చెబుతున్నారు. మన దేశం కూడా అప్రమత్తం అవ్వాల్సిన అవసరం ఉంది. ఎయిర్ పోర్టుల్లో నిఘా ఉంచి తగిన పరీక్షలు చేసి ఈ కొత్త వేరియంట్ ఇండియాలో వ్యాప్తి చెందకుండా చూడాల్సిన అవసరం ఉంది.


Tags:    

Similar News