ఐఏఎస్ vs హెచ్‌ఎండీఏ

పుప్పాల్ గూడ లో ఐఏఎస్, ఐపీఎస్ వర్సెస్ హెచ్ఎండీఏ అధికారుల మధ్య వాగ్వాదం తలెత్తింది.

Update: 2023-05-07 06:18 GMT

పుప్పాల్ గూడ లో ఐఏఎస్, ఐపీఎస్ వర్సెస్ హెచ్ఎండీఏ అధికారుల మధ్య వాగ్వాదం తలెత్తింది. ల్యాంకో హిల్స్ సమీపం లో 100 ఫీట్ల లింక్ రోడ్డు నిర్మాణం పనులను హెచ్‌ఎండీఏ అధికారులు ప్రారంభించారు. అయితే ఈ రోడ్డు పనులను ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు అడ్డుకున్నారు. 2007 సంవత్సరం లో సర్వే నెంబర్ 454 లో 57 ఎకరాల స్థలాన్ని ఆదర్శ్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ కి అప్పటి ప్రభుత్వం కేటాయించింది.

సొసైటీ స్థలంలో...
ఆ కేసు ప్రస్తుతం కోర్టులో ఉంది. తమకు కేటాయించిన స్థలం లో రోడ్డు నిర్మాణ పనులు చేయడమేంటని ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. మాస్టర్ ప్లాన్ ప్రకారం వంద ఫీట్ల రోడ్డు నిర్మాణాల పనులు చేస్తున్నామని హెచ్‌ఎండీఏ అధికారులు చెబుతున్నారు. మాస్టర్ ప్లాన్ రోడ్డు ను చూపి భారీగా హై రేంజ్ అపార్ట్మెంట్ నిర్మాణాలకు అనుమతించారని ఐఏఎస్ అధికారులు ఆరోపిస్తున్నారు. రోడ్డు వేయవద్దంటూ ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల పట్టు బట్టారు. దీంతో ఉద్రిక్తత తలెత్తింది. పోలీసులు వచ్చి పరిస్థిితిని అదుపులోకి తెచ్చారు. ప్రస్తుతానికి నిర్మాణ పనులు నిలిపేశారు.


Tags:    

Similar News