నేడు హైదరాబాద్ కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

నేడు హైదరాబాద్ కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రానున్నారు. లోక్ మంథన్ మహోత్సవంలో ఆమె పాల్గొననున్నారు

Update: 2024-11-21 02:30 GMT

నేడు హైదరాబాద్ కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రానున్నారు. లోక్ మంథన్ మహోత్సవంలో ఆమె పాల్గొననున్నారు. గిరిజన జాతరగా పేర్కొనే ఈ కార్యక్రమాన్ని తొలిసారి దక్షిణాది అయిన హైదరాబాద్ లో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో పాటు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పాల్గొంటారు. వీరితో పాటు పలు రాష్ట్రాల గవర్నర్లు, ఆచార్య మిథిలేష్, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ హాజరు కానున్నారు.

లోక్ మంథన్ కార్యక్రమంలో...
భారత దేశ సాంస్కృతిక వైభవాన్ని చాటి చెప్పే విధంగా లోక్ మంథన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దేశంలో ఉన్న జానపద కళాకారులందరినీ ఒకే వేదిక మీదకు చేర్చి కళలను ప్రదర్శించనున్నారు. ఈ కార్యక్రమంలో పదిహేను వందలకు మందికిపైగా జానపద కళాకారులు పాల్గొంటారు. దీనికి మంత్రి కిషన్ రెడ్డి నేతృత్వం వహించనున్నారు. దేశం నుంచి మాత్రమే కాకుండా విదేశాల నుంచి కూడా జానపద కళాకారులు హాజరవుతున్నారు. దీంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలను అమలు చేయనున్నారు.


Tags:    

Similar News