Telangana : నేడు హైదరాబాద్ అభివృద్ధి పనుల శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు
హైదరాబాద్ ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం కోట్లాది రూపాయలు వ్యయంచేస్తుంది.
హైదరాబాద్ ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం కోట్లాది రూపాయలు వ్యయంచేస్తుంది. అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలను చేస్తుంది. హైదరాబాద్ విస్తరిస్తుండటంతో అందుకు అనుగుణంగా ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించేందుకు కూడా ప్రభుత్వం నిధులను పెద్దమొత్తంలో కేటాయిస్తుంది.
ఐమ్యాక్స్ పక్కన...
ఈరోజు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల అభివృద్ధి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొంటారు. మధ్యాహ్నం మూడు గంటలకు ఐ మ్యాక్స్ పక్కన ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో పాటు మంత్రులు ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీలు , కార్పొరేషన్ చైర్మన్లు పాల్గొననున్నారు.