Gold Price Today : మహిళలకు మంచి కబురు.. బంగారం ధరలు దిగివచ్చినట్లే

ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరల్లో కూడా కొద్దిగా తగ్గుదల కనిపించింది;

Update: 2024-12-02 03:20 GMT

బంగారం ధరలు తగ్గితే అంతకంటే ఎక్కువ ఆనందం మరొకటి ఉండదు. మనం కొనుగోలు చేయకపోయినా ఎప్పుడో కొనుగోలు చేయాలనుకున్న బంగారం, వెండి ధరలు అందుబాటులో ఉంటే వాటిని సొంతం చేసుకునేందుకు అవకాశముందని అంచనా వేస్తున్నారు. బంగారం, వెండి ధరలు అస్సలు ఇటీవల కాలంలో దిగి రావడం లేదు. తగ్గినా స్వల్పంగానే తగ్గుతున్నాయి. ధరలు పెరిగినంత మాదిరిగా తగ్గుదల కనిపించడం లేదు. అందుకే బంగారాన్ని కొనుగోలు చేయడానికి ఇంకా వెయిట్ చేసే వారు ఎక్కువగా ఉన్నారు. మరింత ధరలు పతనమయినప్పుడు కొనుగోలు చేయవచ్చన్న ధోరణి ఎక్కువ మందిలో కనిపించడం కారణంగా ఇటీవల కాలంలో కొనుగోళ్లు కూడా గతంతో పోలిస్తే తగ్గినట్లే అనుకోవాలి.

వ్యాపారుల ధీమా అదే...
అయితే బంగారానికి ఎప్పుడూ డిమాండ్ పడిపోదని, కొనుగోళ్లు మందగించడం తాత్కాలికమేనని వ్యాపారులు చెబుతున్నారు. మహిళలు ముఖ్యంగా మార్కెట్ లోకి కొత్త డిజైన్లు రాగానే ఎంత ధరను వెచ్చించైనా కొనుగోలు చేయడానికి సిద్ధపడుతుంటారు. వాటిని తాము అలంకరించుకోవడానికి తహతహలాడుతుంటారు. ఆ బలహీనతవల్లనే బంగారం ధరలు ఎంత పెరిగినా డిమాండ్ తగ్గదన్న ధీమాలో వ్యాపారులు ఉన్నారు. అయినా తమ దుకాణాల నిర్వహణ ఖర్చులు పెరిగిపోవడంతో పాటు ప్రకటనల ఖర్చు కూడా తోడవ్వడంతో కొనుగోళ్లు బాగా జరిగితేనే వ్యాపారం జరుగుతుంది. ఇందుకోసం అనేక రకాల ఫీట్లను జ్యుయలరీ దుకాణాల యజమానులు చేపడుతున్నారు.
స్వ్పలంగా తగ్గి...
బంగారం, వెండి కొనుగోలు చేయడానికి సాధారణంగా ఎవరూ వెనుకాడరు. పెట్టుబడిగా చూసే వారు బంగారాన్ని ఎంచుకుంటారు. భవిష్యత్ లో తమకు ఉపయోగకరంగా ఉంటుందని భావించి బంగారాన్ని కొనేందుకు ఎక్కువ మంది ఉత్సాహం చూపుతుంటారు. ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరల్లో కూడా కొద్దిగా తగ్గుదల కనిపించింది. పది గ్రాముల బంగారం ధరపై పది రూపాయలు తగ్గింది. కిలో వెండి ధరపై వంద రూపాయలు తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 71,490 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 77,990 రూపాయలుగా ఉంది. కిలో వెండి ధర 99,900 రూపాయలకు చేరుకుంది.


Tags:    

Similar News