Hyderabad : హైదరాబాద్ లో డ్రగ్స్ కలకలం.. నలుగురి అరెస్ట్?
హైదరాబాద్ లో నేడు డ్రగ్స్ పార్టీ కలకలం రేపింది. మాదాపూర్ లోని ఒక హోటల్ రూంలో డ్రగ్స్ పార్టీ చేసుకున్నట్లు గుర్తించారు
హైదరాబాద్ లో నేడు డ్రగ్స్ పార్టీ కలకలం రేపింది. మాదాపూర్ లోని ఒక హోటల్ రూంలో డ్రగ్స్ పార్టీ చేసుకున్నట్లు గుర్తించారు. పోలీసులు దాడి చేసి డ్రగ్స్ తీసుకున్న నలుగురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది. ఒక టీవీలో షోలో కొరియోగ్రాఫర్ తో పాటు, ఆర్కటెక్ ఒకరు ఈ డ్రగ్స్ పార్టీలో పాల్గొన్నారని పోలీసులు తెలిపారు.
పక్కా సమాచారంతో...
పక్కా సమాచారంతో పోలీసులు హోటల్ రూమ్ పై దాడి చేసిన నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి కొంత మొత్తంలో డ్రగ్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బెంగళూరు నుంచి డ్రగ్స్ తెప్పించి దానిని వాడినట్లు పోలీసుల విచారణలో వెల్లడయింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నలుగురికి డ్రగ్స్ పరీక్షలను నిర్వహిస్తున్నారు. వారిని విచారిస్తున్నారు.