30 ఏళ్లకే ఆ బాడీ బిల్డర్ మృతి.. కారణం ఇదేనట
30 ఏళ్లకే ఆ బాడీ బిల్డర్ మృతి.. కారణం ఇదేనట.. 30 సంవత్సరాలకే ఆ బాడీ బిల్డర్ మృతి.. కారణం
జర్మనీకి చెందిన ప్రముఖ బాడీ బిల్డర్ ఇన్‌ఫ్లుయెన్సర్ జో లిండ్నర్ మరణం ప్రపంచ ఫిట్నెస్ రంగాన్ని కుదిపేస్తోంది. 30 సంవత్సరాల వయసులోనే జో లిండ్నర్ చనిపోవడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో లిండ్నర్‌ను 85 లక్షల మంది అనుసరిస్తున్నారు. తన ఫిట్‌నెస్ వీడియోలతో యూట్యూబ్‌లో దాదాపు 50 కోట్ల వ్యూస్‌ను అతడు సొంతం చేసుకున్నాడు. అరుదైన వ్యాధితో అతడు ప్రాణాలు కోల్పోయాడు. జో మెడనొప్పితో బాధపడిన మూడు రోజుల్లోనే చనిపోయాడు. స్నేహితురాలు నిచా సమక్షంలో జో ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.
జో లిండ్నర్ ఫిట్‌నెస్ వీడియోలు అతడికి మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. అయితే జో కండరాల వ్యాధి( రిపిలింగ్ మజిల్ డిసీజ్) సమస్యతో బాధపడుతున్నట్లు తేలింది. సాధారణంగా కండరంపై ఒత్తిడి పెంచితే ఓ రకమైన రసాయనిక చర్య ద్వారా అవి మొత్తం ఒక చోటకు చేరి బలంగా కనిపిస్తాయి. కానీ, రిపిలింగ్ మజిల్ డిసీజ్ ఉన్నవారిలో కండరాలు విపరీతమైన ఒత్తిడికి గురై ఒకే కండరంలా కాకుండా వేర్వేరుగా మారిపోతాయి. ఇలా కనీసం 20 సెకన్ల వరకు అది ప్రభావం చూపిస్తుంది. కొన్ని సందర్భాల్లో క్రాంప్ ఏర్పడి ఓ గడ్డ లాగా వచ్చి విపరీతమైన నొప్పికి కారణం అవుతుందట..! ఈ విషయాన్ని జో లిండ్నర్ ఎప్పుడూ ప్రస్తావించేవాడు. అనూరిజం కారణంగా లిండ్నర్ చనిపోయి ఉంటారని అతడి అభిమానులు అనుమానిస్తున్నారు. రక్తనాళాలు సన్నబడటం లేదా బలహీనపడటం వలన అనూరిజం ఏర్పడుతుందని అంటున్నారు. ఇక ఫిట్నెస్ ఇండస్ట్రీలో స్టెరాయిడ్స్ కూడా తీసుకుంటూ ఉంటారని.. అవి కూడా జో మరణానికి కారణమై ఉంటాయని ఓ వర్గం అనుమానిస్తూ ఉన్నారు.