బీరుట్ లో మళ్లీ దాడులు.. పద్దెనిమంది మృతి

బీరుట్ లో మళ్లీ ఇజ్రాయిల్ దాడులకు దిగింది. వైమానిక దాడుల్లో దాదాపు పద్దెనిమిది మంది మరణించారు;

Update: 2024-10-11 06:48 GMT
israel, attacked, airstrikes, beirut latest news today, israel attacked again in beirut, eighteen people were killed in airstrikes, latest israel news today telugu

 israel attacked again in beirut

  • whatsapp icon

బీరుట్ లో మళ్లీ ఇజ్రాయిల్ దాడులకు దిగింది. వైమానిక దాడుల్లో దాదాపు పద్దెనిమిది మంది మరణించారు. దాదాపు వంద మంది గాయపడ్డారు. కొన్ని భవనాలు ఈ దాడుల్లో పూర్తిగా ధ్వంసమయ్యాయి. లెబనాన్ సెంట్రల్ బీరూట్ లోని రెండు వేరు వేరు ప్రాంతాల్లో ీఈ దాడులు జరిగాయి. హిజ్‌బుల్లాలకు వ్యతిరేకంగా ఇజ్రాయిల్ ఈ దాడులకు పాల్పడిందని ఆరోపిస్తుంది. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని చెబుతున్నారు.

ఉగ్రవాదులే లక్ష్యంగా...
అయితే రెండు ప్రాంతాల్లో ఈ వైమానిక దాడులు జరిగాయి. తొలి దాడి రస్ అల్ నాబా ప్రాంతంలో జరిగింది. రెండో దాడి బుర్జ్ అబీ హైదర్ ప్రాంతంలో జరిగాయి. నిన్న పాఠశాలపై ఇజ్రాయిల్ జరిగిన దాడిలో దాదాపు ఇరవై ఏడు మంది వరకూ మరణించారని చెబుతున్నారు. ఉగ్రవాదులు పౌరుల మధ్య తల దాచుకుంటున్నట్లు పసిగట్టి నగరాలపై ఇజ్రాయిల్ దాడులకు దిగింది. ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకుని దాడులకు దిగినప్పటికీ సామాన్య పౌరులందరూ ఈ దాడుల్లో మరణిస్తున్నారు.
Tags:    

Similar News