ఈ నెల 21న సుదీర్ఘమైన రాత్రి... పదహారు గంటలు.. అరుదైన ఘటన

డిసెంబర్ నెలలో సుదీర్ఘ రాత్రి ఉండనుంది. ఇది అరుదైన విషయమని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Update: 2024-12-17 02:25 GMT

డిసెంబర్ నెలలో సుదీర్ఘ రాత్రి ఉండనుంది. ఇది అరుదైన విషయమని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ నెల 21 వతేదీ రాత్రి సుదీర్ఘంగా కొనసాగుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ నెల 21న సుదీర్ఘమైన రాత్రి ఉండనుంది. దాదాపు పదహారు గంటల పాటు రాత్రి సమయం ఉంటుంది. మిగిలిన ఎనిమిది గంటల పాటు పగలు ఉండనుందని శాస్త్రవేత్తలు ప్రకటించారు.

అయనాంతంగా...
కొన్నేళ్ల తర్వాత ఇలాంటి ఘటనలను చోటు చేసుకుంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇలా జరగడాన్ని అయనాంతం అని పిలుస్తారు. అయితే అయనాంతం ఏర్పడిన రోజున భూమి ఉత్తరార్థగోళం సూర్యునికి ఎక్కువ దూరం వెళుతుందని, ఆ సమయంలో చంద్రకాంతి భూమిపై చాలా సమయం ఉంటుందని, ఇది శీతాకాలంలో ఏర్పడుతున్నందున దీనిని 'శీతాకాలపు అయనాంతం' అని అంటారని ఖగోళ శాస్త్రవేత్తలు తెలిపారు.


Tags:    

Similar News