America : అమెరికాలో మరోసారి కాల్పులు.. ఐదుగురు మృతి
అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. ఈ కాల్పుల్లో ఐదుగురు మరణించారు.
అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. ఈ కాల్పుల్లో ఐదుగురు మరణించారు. మరో ఐదుగురు గాయపడినట్లు అధికారులు తెలిపారు. విస్కాన్సిన్ లోని మాడిసన్ లో ఉన్న అబండంట్ క్రిస్టియన్ స్కూలులో కాల్పులు జరిగాయి. ఈ కాల్పులకు పాల్పడింది 12వ తరగతి విద్యార్ధి కావడం విశేషం. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
కాల్పులకు పాల్పడిన...
మృతుల్లో కాల్పులకు తెగపడిన విద్యార్థి కూడా ఉన్నాడని పోలీసులు తెలిపారు. మృతి చెందిన వారు ఎవరన్నది ఇంకా తెలియరాలేదు. పోలీసులు వారెవరన్నది నిర్ధారించాల్సి ఉంది. కాల్పుల సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని సహాయ కార్యక్రమాలను చేపట్టారు. ఈ ఘటనతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఆందోళనతో తల్లిదండ్రులు తమ పిల్లల కోసం చూస్తున్నారు. అయితే పన్నెండో తరగతి విద్యార్థి కాల్పులకు తెగపడటానికి కారణం మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది.