ఆచార్య ఆ విధంగా రికార్డు సెట్ చేసిందా?
చిరంజీవి – కొరటాల శివ కాంబోలో భారీ అంచనాల మధ్యన తెరకెక్కుతున్న ఆచార్య సినిమాపై ఓ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హైలెట్ అవుతుంది. నవంబర్ [more]
చిరంజీవి – కొరటాల శివ కాంబోలో భారీ అంచనాల మధ్యన తెరకెక్కుతున్న ఆచార్య సినిమాపై ఓ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హైలెట్ అవుతుంది. నవంబర్ [more]
చిరంజీవి – కొరటాల శివ కాంబోలో భారీ అంచనాల మధ్యన తెరకెక్కుతున్న ఆచార్య సినిమాపై ఓ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హైలెట్ అవుతుంది. నవంబర్ చివరి వారంలో షూటింగ్ చిత్రీకరణ ప్రారంభించిన కొరటాల శివ .. ఆచార్య షూటింగ్ ని ఆఘమేఘాల మీద పరిగెత్తిస్తున్నాడు. ఈ సినిమాలో మరో కీలక పాత్రలో కనిపించనున్న రామ్ చరణ్ కూడా సంక్రాంతి తర్వాత ఆచార్య షూటింగ్ లో పాల్గొనబోతున్నాడనే టాక్ ఉండగా.. ఇప్పుడు చిరు ఆచార్య పై ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ప్రచారంలోకొచ్చింది. అది చిరంజీవి ఆచార్య కోసం ఓ టెంపుల్ సెట్ ని నిర్మించారట. హైదరాబాద్ నగర శివార్లలోని కోకాపేట లో 24 ఎకరాల విస్తీర్ణంలో ఈ భారీ టెంపుల్ సెట్ నిర్మాణం చేశారట.
దేశంలో ఇంతకూ ముందెన్నడూ.. అన్ని ఎకరాలను ఓ సెట్ కోసం వాడలేదట. కాని ఆచార్య సినిమా కోసం 24 ఎకరాల విస్తీరణాన్ని ఓ టెంపుల్ సెట్ కోసం వాడడం రికార్డు అంటున్నారు. అంతేకాకుండా ఆ సెట్ కోసం కోట్లు ఖర్చు పెట్టినట్లుగా తెలుస్తుంది. ఈ టెంపుల్ సెట్ లోనే ఆచార్య మేజర్ సన్నివేశాలు చిత్రీకరణ ఉంటుంది అని.. ఈ నెల మొదటి వారంలో చిరు సోలో సన్నివేశాల చిత్రకరణ జరుగుతుంది అని.. సంక్రాంతి తర్వాత రామ్ చరణ్ కూడా ఆచార్య సెట్ లో జాయిన్ అవ్వొచ్చనే ఊహాగానాలు ఉన్నాయి. అయితే రామ్ చరణ్ అటు RRR ఇటు ఆచార్య రెండు సినిమాలలోనూ తన వేర్వేరు లుక్స్ తో ఎలా బ్యాలెన్స్ చేస్తాడనే దాని మీద మెగా ఫాన్స్ లో ఆసక్తికర చర్చ మొదలయ్యింది.