తమన్నా పెళ్లి కి రెడీ అయిందే

టాలీవుడ్ లో ఒక ఊపు ఊపేసిన తమన్నా కు ఈ మధ్య సౌత్ లో సినిమా అవకాశాలు తగ్గాయి. అందుకేమో పెళ్లి చేసుకోవడానికి రెడీ అయింది. తమన్నా [more]

;

Update: 2019-08-07 08:22 GMT
తమన్నా
  • whatsapp icon

టాలీవుడ్ లో ఒక ఊపు ఊపేసిన తమన్నా కు ఈ మధ్య సౌత్ లో సినిమా అవకాశాలు తగ్గాయి. అందుకేమో పెళ్లి చేసుకోవడానికి రెడీ అయింది. తమన్నా తల్లి ప్రస్తుతం ఈమెకు పెళ్లి సంబంధాలు చూసే పనిలో ఉందట. ఆమె ఎప్పటినుండో నన్ను పెళ్లి చేసుకో అని అడుగుతుందని కానీ నాకు వరస సినిమా అవకాశాలు ఉండడంతో లేట్ చేశాను అని చెప్పింది.

అమ్మ చెప్పినట్లే….

తమన్నా కోసం ఆమె అమ్మ మంచి అబ్బాయి ని వెతికే పనిలో ఉన్నారట. ఈ విషయాన్ని తమన్నా స్వయంగా వెల్లడించింది. నేను ఎవరిని పెళ్లి చేసుకోవాలి అనేది అమ్మ నిర్ణయమేనని, ప్రస్తుతం ఆమె వరుడిని వెతికే ప్రయత్నాలను ముమ్మరం చేసిందని చెప్పుకొచ్చింది. అలానే ఈమధ్య తన పై వచ్చిన ప్రేమ, డేటింగ్ వార్తలన్నీ వదంతులేనని తమన్నా మండిపడింది. తాను ఇప్పటివరకు ఎవరిని ప్రేమించలేదని…ఒకవేళ చేస్తే ముందుగా మీడియాకే చెప్పేదాన్ని అని చెప్పింది. ప్రస్తుతం ఈమె కోలీవుడ్ లో ‘పెట్రోమ్యాక్‌’ అనే సినిమాలో విశాల్ కి జోడిగా నటిస్తుంది.

Tags:    

Similar News