అనసూయ ఆ ఆఫర్ ని వదిలేసిందా?

అనసూయ ప్రస్తుతం క్రేజీ హాట్ యాంకర్. బుల్లితెర మీదే కాదు.. వెండితెర మీద కూడా అనసూయ ప్రత్యేకమైన పాత్రలతో దూసుకుపోతుంది. ప్రస్తుతం కృష్ణవంశీ రంగమార్తాండ లో అనసూయ [more]

Update: 2020-05-20 08:12 GMT

అనసూయ ప్రస్తుతం క్రేజీ హాట్ యాంకర్. బుల్లితెర మీదే కాదు.. వెండితెర మీద కూడా అనసూయ ప్రత్యేకమైన పాత్రలతో దూసుకుపోతుంది. ప్రస్తుతం కృష్ణవంశీ రంగమార్తాండ లో అనసూయ ఓ కీలక పాత్రలో చేస్తుంటే.. ఆచర్యలోనూ, అల్లు అర్జున్ పుష్ప లోను అనసూయ మంచి పాత్రలు చేస్తుంది అనే టాక్ ఉంది. అలాంటి క్రేజీ హాట్ యాంకర్ ఓ భారీ ఆఫర్ ని తిరస్కరించింది అనే టాక్ ఇప్పుడు ఫిలింసర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది.

అనసూయ కి బిగ్ బాస్ సీజన్ 4 నుండి ఆఫర్ వచ్చిందట. భారీ పారితోషకం ఇస్తాం.. షో లో ఎక్కువ ప్రయారిటీ ఇస్తాం షో లో నటించమని బిగ్ బాస్ యాజమాన్యం అనసూయ కి బంపర్ ఆఫర్ ఇచ్చిందట. అయితే అనసూయ మాత్రం తెలివిగా నేను బుల్లితెర మీద, వెండితెర మీద అవకాశాలతో బాగా బిజీ.. సో మీరు ఎంతిచ్చినా నేను రాలేను అంటూ సున్నితంగా తిరస్కరించిందట. అయితే బిగ్ బాస్ కి వెళితే ఉన్న ఇమేజ్ కూడా డ్యామేజ్ అయ్యేలా కనబడుతుంది కాబట్టే.. అనసూయ ఇలా ఆ భారీ ఆఫర్ ని తిరస్కరించినట్లుగా ఫిలింనగర్ టాక్.

Tags:    

Similar News