సమంత లా రాకెట్ స్పీడు ఉంటుందా?లేదంటే..!!

సమంత కెరీర్ పీక్స్ లో ఉండగానే నాగ చైతన్య తో ప్రేమాయణం నడపడం.. పెళ్లితో వారిద్దరూ ఒక్కటవ్వడం జరిగిపోయింది. పెళ్లి ని గోవా లో చేసుకున్న ఈ [more]

Update: 2020-10-08 05:12 GMT

సమంత కెరీర్ పీక్స్ లో ఉండగానే నాగ చైతన్య తో ప్రేమాయణం నడపడం.. పెళ్లితో వారిద్దరూ ఒక్కటవ్వడం జరిగిపోయింది. పెళ్లి ని గోవా లో చేసుకున్న ఈ జంట సినిమా ఇండస్ట్రీకి అభిమానులకు కలిపి గ్రాండ్ గా రిసెప్షన్ ఇచ్చింది సమంత జంట. ఇక పెళ్లి తర్వాత కూడా సమంత తన పాత్రకి ప్రత్యేకత ఉన్న సినిమాలను ఎంచుకుంటూ కెరీర్ ని సక్సెస్ ఫుల్ గా నడిపిస్తుంది. పెళ్లీ దగ్గరనుండి ఇప్పటివరకు సమంత ఖాళీగా ఉన్న టైం లేదంటే నమ్మాలి. పెళ్లి కెరీర్ కి అడ్డుకాదని నిరూపించిన తార సమంత. ఇప్పటికీ సమంత సై అంటే అవకాశాలు పోలోమనేలా ఉంటే.. సమంత మాత్రం ఆచి తూచి అవకాశాలు వాడుతుంది.

అయితే ఇప్పుడు మరో సీనియర్ భామ కాజల్ కూడా పెళ్లి పీటలెక్కుతుంది. అనుకోకుండా అందరికి షాకిచ్చిన కాజల్ ఈ నెలాఖరున వివాహం చేసుకోబోతుంది. బిజినెస్ మ్యాన్ గౌతమ్ ని పెళ్లాడనున్న కాజల్ పెళ్లి తర్వాత కూడా నటిస్తానని తెగేసి చెప్పేసింది. ఇప్పటివరకు సీనియర్ హీరోలనుండి అవకాశాలు దండిగా దండుకుంటున్న కాజల్.. పెళ్లి తర్వాత ఆంటే స్పీడు కంటిన్యూ చేయగలదా? సమంత లా కెరీర్ ని మలుచుకోగలదా? సమంత అటు ఫ్యామిలీకి ఇటు కెరీర్ కి కావాల్సిన ఇంపార్టెన్స్ ఇస్తూ తనకంటూ ప్రత్యేకతను చాటుకున్నట్టుగా కాజల్ కూడా తన కెరీర్ ని మలుచుకోగలదా? ఇప్పుడు అభిమానులే కాదు అందరిముందు ఉన్న పెద్ద ప్రశ్న.

Tags:    

Similar News