బాస్: వాట్ ఏ లుక్!!
ప్రస్తుతం ఇండస్ట్రీ మొత్తం కరోనా గురించిన చర్చతో మెల్లగా షూటింగ్స్ కోసం బయలుదేరుతున్న వేళ ఆచార్య సినిమా విషయంలో చిరు – కొరటాల ఎప్పుడు సెట్స్ మీదకెళ్తారో [more]
ప్రస్తుతం ఇండస్ట్రీ మొత్తం కరోనా గురించిన చర్చతో మెల్లగా షూటింగ్స్ కోసం బయలుదేరుతున్న వేళ ఆచార్య సినిమా విషయంలో చిరు – కొరటాల ఎప్పుడు సెట్స్ మీదకెళ్తారో [more]
ప్రస్తుతం ఇండస్ట్రీ మొత్తం కరోనా గురించిన చర్చతో మెల్లగా షూటింగ్స్ కోసం బయలుదేరుతున్న వేళ ఆచార్య సినిమా విషయంలో చిరు – కొరటాల ఎప్పుడు సెట్స్ మీదకెళ్తారో క్లారిటీ లేక మెగా ఫాన్స్ చర్చించుకుంటున్న సమయంలో మెగాస్టార్ చిరు లుక్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. మొన్నామధ్యన లాక్ డౌన్ సమయంలో మీస కట్టు, గెడ్డం తీసేసి వైరిటి లుక్ లో కనబడిన చిరు తాజాగా గుండు బాస్ లుక్ లో కనిపించి షాకిచ్చారు. ఎప్పుడూ కనిపించని లుక్ లో చిరు కనబడేసరికి మెగా ఫాన్స్ షాకవడమే కాదు.. బాస్ వాట్ ఏ లుక్ అంటూ కామెంట్ చేస్తున్నారు.
అసలు ఆచార్య షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో తెలియని టైం లో చిరు కొత్త మేకోవర్ దేని కోసమో జనాలకు అర్ధం కావడం లేదు. లైట్ గా మీసాలు ఉంచేసి.. గుండు చేయించుకుని కొత్త మేకోవర్ లోకి దిగిన చిరు ఈ గుండు లుక్ ఆచార్య కోసమేనా? అనేది ఇప్పుడు అందరిలో ఉన్న అతి పెద్ద డౌట్. గుండుతో నల్లని కళ్లద్దాలు పెట్టుకుని కనబడుతున్న చిరు ఆ గుండు ఫోటో ని సోషల్ మీడియాలో షేర్ చేసి నేను సాధువులా ఉన్నానా.. అంటూ హాష్ టాగ్ తగిలించాడు. ఇక చిరు నిజంగా గుండు చేయించుకున్నాడా? లేదంటే మేకప్ మహిమా? లేదు అంటే ఫోటో షాప్ లుక్కా? అంటూ మెగా ఫాన్స్ లో రకరకాల డౌట్స్ క్రియేట్ చేసిన చిరు లుక్ మాత్రం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది.