చిరు vs వెంకీ!

సినిమాల డేట్స్ విషయంలో, థియేటర్స్ పంచుకునే విషయంలో ఈ మధ్యన ఇండస్ట్రీలో చాలా పంచాయితీలు జరుగుతున్నాయి. కొన్ని సినిమాల గొడవలు పెద్దలవరకు లేదంటే నిర్మాతల మండలిలో పంచాయితీల [more]

Update: 2021-01-30 16:08 GMT

సినిమాల డేట్స్ విషయంలో, థియేటర్స్ పంచుకునే విషయంలో ఈ మధ్యన ఇండస్ట్రీలో చాలా పంచాయితీలు జరుగుతున్నాయి. కొన్ని సినిమాల గొడవలు పెద్దలవరకు లేదంటే నిర్మాతల మండలిలో పంచాయితీల వరకు వెళుతున్నాయి. గత ఏడాది రిలీజ్ డేట్స్ విషయంలో మహేష్ – అల్లు అర్జున్ నటించిన సరిలేరు నీకెవ్వరూ – అలా వైకుంఠపురములో మధ్యన పంచాయితీ జరిగి అందులో ఒకరు తాగాల్సి వచ్చింది. తర్వాత కూడా చిన్న సినిమాల దగ్గరనుండి పెద్ద సినిమాల వరకు ఇలాంటి రిలీజ్ డేట్ పంచాయితీలు ఉంటూనే ఉన్నాయి. మరి గత రెండు రోజులుగా రిలీజ్ డేట్స్ జాతర టాలీవుడ్ ని ఊపేస్తోంది. అందులో డేట్స్ క్లాష్ అయిన సినిమాలు పెద్దగా కనిపించలేదు. కానీ మే లో సీనియర్ హీరోలిద్దరూ నువ్వా-నేనా అంటూ పోటీ పడుతున్నారు. 
అందులో శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా అసురన్ రీమేక్ గా తెరకెక్కుతున్న నారప్ప సినిమాని మే 14 రిలీజ్ అంటూ మధ్యాన్నం డేట్ లాక్ చేసి ప్రకటించారు. నారప్ప మే 14 అంటూ డేట్ అనౌన్స్ చేసారు. అయితే అదే రోజు సాయంత్రానికి చిరంజీవి – రామ్ చరణ్ కాంబోలో కొరటాల శివ తెరకెక్కిస్తున్న మెగా మల్టీస్టారర్ ఆచార్య సినిమా మే 13 రిలీజ్ అంటూ డేట్ వదిలారు. మరి ముందుగా నారప్ప టీం డేట్ ప్రకటించగా.. సాయంత్రానికి కూల్ గా ఆచార్య టీం డేట్ వదిలింది. రెండు రోజుల తేడాతో రెండు పెద్ద సినిమాల రిలీజ్ అంటే థియేటర్స్ విషయంలో రగడ, కాల్క్షన్స్ విషయంలో పోటీలు తప్ప మరేమి ఉండదు.
అయితే ఇక్కడ పెద్ద సినిమాలైనా డేట్స్ క్లాష్ అవడంతో నారప్ప – ఆచార్య పంచాయితీ మాత్రం షురు అయ్యేలాగే కనబడుతుంది. మరి నారప్ప రిలీజ్ విషయంలో గొడవలెందుకులే అని సురేష్ బాబు కాస్త తగ్గినా తగ్గొచ్చు. ఎందుకంటే సురేష్ బాబుకి ఇలాంటి రిస్క్ తీసుకోవడం నచ్చదు కనకే నారప్ప డేట్ మారినా మారొచ్చు అంటున్నారు ట్రేడ్ పండితులు.

Tags:    

Similar News