ఈసారి సినిమాలకన్నా… స్టార్ హీరోల ఫ్యామిలీ పిక్చర్స్ అదుర్స్!!

వినాయకచవితి స్పెషల్ గా చాలామంది సినిమాల దర్శకనిర్మాతలు ఫస్ట్ లుక్ పోస్టర్స్ అలాగే టీజర్ అంటూ సోషల్ మీడియా హంగామానే వేరు. కానీ ఈ వినాయకచవితికి కరోనా [more]

Update: 2020-08-23 06:29 GMT

వినాయకచవితి స్పెషల్ గా చాలామంది సినిమాల దర్శకనిర్మాతలు ఫస్ట్ లుక్ పోస్టర్స్ అలాగే టీజర్ అంటూ సోషల్ మీడియా హంగామానే వేరు. కానీ ఈ వినాయకచవితికి కరోనా అడ్డం పడింది. చాలామంది దర్శకనిర్మాతలు తమ సినిమాల లుక్స్ ని విడుదల చేయలేకపోయారు. కొత్త పోస్టర్స్, న్యూ లుక్స్ హడావిడి ఎక్కడా కనిపించలేదు. కానీ స్టార్ హీరోలు ఫామిలీస్ వినాయక పూజలు ఇప్పుడు సోషల్ మీడియాలో హైలెట్ అయ్యాయి. చిరంజీవి దగ్గరనుండి బాలకృష్ణ వరకు గణపతి పూజ చేసిన ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హైలెట్ అయ్యాయి.

చిరు సతీమణితో కలిసి రామ్ చరణ్ ఉపాసనలు గణపతి పూజ చేస్తే.. బాలయ్య బసవతారకం లో గణేష్ పూజ చేసాడు. ఇక కొత్త పెళ్ళికొడుకు నితిన్ భార్య శాలినితో కలిసి గణపయ్య పూజ చెయ్యగా… అల్లు అర్జున్ తన ఫ్యామిలీతో గణపతి పూజ సందర్భంగా తీసిన పిక్స్ అటు బాలీవుడ్లోనూ వైరల్ అయ్యాయి. ఇక మంచు ఫ్యామిలీ కూడా గణపతి పూజ చెయ్యగా.. మహేష్ పిల్లలు గౌతమ్, సితారలు నమ్రత హ్యాండ్ మీదగా గణపతి పూజ చేసారు. మరి వినాయక చవితి పోస్టర్స్ లేక ఫిలయిన హీరోల అభిమానులు సోషల్ మీడియాలో తమ హీరోలు ఫామిలీస్ తో కలిసి బొజ్జ గణపయ్యను పూజించిన ఫొటోస్ తో హ్యాపీ ఫీలవుతున్నారు.

Tags:    

Similar News