గాడ్ ఫాదర్ 8 రోజుల కలెక్షన్స్ వివరాలివిగో !

తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోనూ గాడ్ ఫాదర్ కు విశేషమైన ఆదరణ లభిస్తుంది. ఇక ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా 8 రోజుల్లో..;

Update: 2022-10-13 13:32 GMT
godfather world wide collections, chiranjeevi

godfather collections

  • whatsapp icon

మెగాస్టార్ చిరంజీవి - మోహన్ రాజా కాంబినేషన్ లో రూపొందిన గాడ్ ఫాదర్ సినిమా ఈనెల 5వ తేదీన విడుదలైంది. ఈ సినిమాలో నయన తార నటిస్తుందని తెలియగానే.. అందరూ చిరంజీవికి జోడీ అనుకున్నారు కానీ.. నయనతార చిరంజీవికి చెల్లెలిగా, సత్యదేవ్ కి భార్యగా కనిపించింది. గాడ్ ఫాదర్ లో చిరంజీవికి జోడీ లేకపోవడంతో.. డ్యూయట్లు పడలేదు. అలాంటి చిరంజీవి సినిమాకు ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందోనని అందరూ టెన్షన్ పడ్డారు కానీ.. తొలిరోజు తొలి షో తోనే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది గాడ్ ఫాదర్ మూవీ.

తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోనూ గాడ్ ఫాదర్ కు విశేషమైన ఆదరణ లభిస్తుంది. ఇక ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా 8 రోజుల్లో రూ.145.24 కోట్లు వసూలు చేసింది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తూ.. ఓ పోస్టర్ విడుదల చేశారు. 'ఆచార్య' సినిమా వలన కలిగిన అసంతృప్తికి 'గాడ్ ఫాదర్' సమాధానం చెబుతుందని చిరంజీవి చెప్పారు. ఇప్పుడు అదే నిజమైంది. తాజా.. సినిమా ప్రెస్ మీట్ లో దర్శకుడు మోహన్ రాజా మాట్లాడుతూ.. "సినిమా విడుదలైన తరువాత నాకు ఫస్టు చరణ్ దగ్గర నుంచి కాల్ వచ్చింది. ఈ సినిమా గురించి ఆయన అరగంటసేపు మాట్లాడుతూ నన్ను అభినందించారు. నిజంగా అది నాకు చాలా ఆనందాన్ని కలిగించిన విషయం. ఆ తరువాత బన్నీ .. సాయిధరమ్ తేజ్ కూడా కాల్ చేసి మాట్లాడారు" అని తెలిపారు.


Tags:    

Similar News