Pushpa Jagadish : పుష్ప షూటింగ్ కోసం జగదీష్‌కి బెయిల్..!
జగదీశ్ పోషిస్తున్న 'కేశవ' పాత్ర షూటింగ్ ఇంకా ఉండడంతో బెయిల్ వచ్చాక షూట్ చేయనున్నారట. ఇంతకీ మహిళ ఆత్మహత్యకి కారణం ఏంటి..?
Pushpa Jagadish : అల్లు అర్జున్ 'పుష్ప' మూవీలో హీరో పక్కన స్నేహితుడిగా 'కేశవ' అనే పాత్రలో నటించి మంచి ఫేమ్ ని సంపాదించుకున్న నటుడు జగదీశ్. తాజాగా ఈ నటుడిని ఒక మహిళ జూనియర్ ఆర్టిస్ట్ ఆత్మహత్య కేసులో పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కాగా ప్రస్తుతం ఈ నటుడు పుష్ప 2 షూటింగ్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. పుష్ప కథని చెబుతూ సినిమాలో పుష్ప పక్కన ఉండే ఈ ప్రధాన పాత్రకి సంబంధించిన షూట్ ఇంకా పూర్తి అవ్వలేదట.
జగదీశ్ పోషిస్తున్న 'కేశవ' పాత్రకి సంబంధించిన షూటింగ్ ఇంకా చేయాల్సింది చాలా ఉందట. దీంతో అతడు ఉన్న సీన్స్ ప్రస్తుతానికి పక్కన పెట్టారట. జగదీశ్ బెయిల్ మీద బయటకి వచ్చాక అతడి పై బ్యాలన్స్ ఉన్న షూట్ మొత్తాన్ని ఒకేసారి కంప్లీట్ చేస్తారని ఫిలిం వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. జగదీశ్ అరెస్ట్ విషయం మాత్రం టాలీవుడ్ లో సంచలనంగా మారింది. ఇంతకీ అసలు ఏమైంది..? ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఏంటి..?
పోలీసులు చెప్పిన వివరాలు బట్టి.. కాకినాడకు చెందిన ఆ మహిళకు ఆరేళ్ళ క్రిందట వివాహం జరిగింది. అయితే కొంత కాలానికే విభేదాలతో విడిపోయారు. ఆ తరువాత హైదరాబాద్ వచ్చిన ఆ మహిళ సోమాజిగూడలోని ఒక అపార్ట్మెంట్ లో నివసిస్తూ ఇండస్ట్రీలో జూనియర్ ఆర్టిస్ట్ గా చేస్తుంది. ఈక్రమంలోనే జగదీశ్ తో ఆమెకు పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. కొంత కాలం కలిసి కూడా జీవించారు. ఆమె జగదీశ్ ని పెళ్లి చేసుకోవాలని అనుకుంది.
కానీ జగదీశ్ ఇంతలో మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. దీంతో ఆ మహిళ జగదీశ్ ని దూరం పెట్టింది. కానీ జగదీశ్ మాత్రం ఆమె వెంట పడుతూనే వచ్చాడు. ఈమద్యలో ఆ మహిళ మరొక వ్యక్తితో బంధం ఏర్పడుచుకుంది. నవంబర్ 27వ తేదీ రాత్రి ఆ మహిళ తన అపార్ట్మెంట్ లో ఆ వ్యక్తితో అర్దనగ్నంగా ఉన్న సమయంలో జగదీశ్.. వారిని కిటికీ నుంచి ఫోటోలు తీశారు. అయితే కిటికీ చప్పుడు రావడంతో ఆ మహిళ, వ్యక్తి.. జగదీశ్ ని గమనించి ఆగ్రహం వ్యక్తం చేశారు.
అయితే జగదీశ్ తాను తీసిన ఫోటోలను చూపించి వారిని భయపెట్టడానికి ప్రయత్నించాడు. మహిళతో ఉన్న వ్యక్తి పోలీసులకి చెబుతాం అని అనడంతో జగదీశ్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అయితే జగదీశ్ మాత్రం ఆ ఫోటోలను ఆ మహిళకి పంపించి.. తనకి సహకరించకపోతే ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసేస్తా అని బెదిరించాడట. దీంతో ఏం చేయాలో తెలియక ఆ మహిళ 29న తన ఫ్లాట్ లో ఉరి వేసుకొని మరణించింది.
ఇక ఈ కేసుని ఫైల్ చేసుకున్న పోలీసులు మహిళ ఆత్మహత్యకి గల కారణం ఎవరని విచారణ మొదలుపెట్టారు. మహిళ బంధువుల జగదీశ్ పై అనుమానం ఉందని పోలీసులకి తెలియజేసారు. పోలీసులు మహిళ కాల్ డేట్ ఓపెన్ చేసి.. ఆ మహిళతో ప్రస్తుతం సంబంధంతో మెయిన్‌టైన్ చేస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతడు 27 రాత్రి జరిగింది చెప్పడంతో జగదీశ్ అసలు కారణం తెలిసి అతడిని అరెస్ట్ చేశారు.