సూర్య అభిమానులకు తీవ్ర నిరాశ.. ఆస్కార్ మిస్
జై భీమ్ గురించి కూడా బిగ్ అనౌన్స్ మెంట్ వస్తుందని ఎంతో ఆశగా ఎదురుచూశారు అభిమానులు. కానీ కొన్ని కారణాల వల్ల జై భీమ్
"జై భీమ్" సినిమా ద్వారా ఆస్కార్ వస్తుందని.. ఎంతో ఆశగా ఎదురుచూసిన సూర్య అభిమానులకు తీవ్ర నిరాశ తప్పలేదు. ఆస్కార్ రేసులో జై భీమ్ ఉంటుందని ఎంతో ఆశగా ఎదురుచూశారు. టీజే జ్ఞానవేల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆస్కార్ 2022లో పాల్గొనలేకపోయింది. ఈ సినిమా ఆస్కార్ నుంచి ఔట్ అవ్వడంపై అభిమానులు, సినీ ప్రముఖులు ట్విట్టర్ వేదికగా స్పందించారు. 94వ అకాడమీ అవార్డ్స్‌లో ఉత్తమ చిత్రం విభాగంలో పోటీ చేసేందుకు అర్హత సాధించిన 276 చిత్రాలలో ఒకే ఒక్క తమిళ మూవీ "జై భీమ్".
మంగళవారం రాత్రి ఆస్కార్ 2022 అవార్డ్స్ నామినేషన్ల ప్రకటన రాగా.. అందులో జై భీమ్ గురించి కూడా బిగ్ అనౌన్స్ మెంట్ వస్తుందని ఎంతో ఆశగా ఎదురుచూశారు అభిమానులు. కానీ కొన్ని కారణాల వల్ల జై భీమ్ ఆస్కార్ నుంచి ఔట్ అయిందని ప్రకటించారు. దీంతో కాస్త నిరాశకు గురైనా.. జై భీమ్ అంతర్జాతీయ స్థాయికి చేరుకున్నందుకు గర్వంగా ఉందని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. గతేడాది నవంబర్ 2న విడుదలైన గ్రిప్పింగ్ కోర్ట్ రూమ్ డ్రామా భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకులను ఆకట్టుకుంది. 94వ అకాడమీ అవార్డ్స్‌లో బెస్ట్ ఫిల్మ్ కేటగిరీలో మొత్తం 276 సినిమాలు పోటీ పడ్డాయి. వీరిలో 10 మంది మాత్రమే షార్ట్‌లిస్ట్‌లో ఉన్నారు. మొత్తం 23 కేటగిరీలలోని నామినేషన్లను ట్రేసీ ఎల్లిస్ రాస్, లెస్లీ జోర్డాన్ నిన్న ప్రకటించారు.