భుజంపై పులిబొమ్మ గురించి ఎన్టీఆర్ వివరణ.. ఆస్కార్ రావడంపై ఆయన స్పందన ?

ఆయన షేర్వాణీపై ఉన్న పులిబొమ్మ అందరినీ ఆకర్షించింది. దాని గురించి ఆస్కార్ నిర్వాహకులు ఆరా తీశారు.

Update: 2023-03-13 07:46 GMT

ntr about oscar awards

ఆస్కార్ వేడుకల్లో ఆర్ఆర్ఆర్ టీమ్ తళుక్కుమంది. ముఖ్యంగా డిజైనర్ దుస్తుల్లో తారక్, చరణ్ లు మెరిసిపోయారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ అనే పేరుకు తగ్గట్టుగా.. ఎన్టీఆర్ నలుపురంగు షేర్వాణీలో భుజంపై పులి బొమ్మతో రెడ్ కార్పెట్ పై నడుస్తూ మెరిసిపోయారు. ఆయన షేర్వాణీపై ఉన్న పులిబొమ్మ అందరినీ ఆకర్షించింది. దాని గురించి ఆస్కార్ నిర్వాహకులు ఆరా తీశారు. ఈ పులి బొమ్మ ఏమిటని ఓ యాంకర్ అడగ్గా ఎన్టీఆర్ తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. ‘ఆర్ఆర్ఆర్‌లో చూశారు కదా. నాతో పాటు పులి కనిపించింది. నిజానికి, పులి మా దేశ జాతీయ జంతువు. మా దేశ చిహ్నంతో రెడ్ కార్పెట్‌పై నడవడం గర్వంగా ఉంది’ అని చెప్పడంతో.. ఆ యాంకర్ ఫిదా అయ్యారు. మిమ్మల్ని చూస్తే దక్షిణ ఆసియా మొత్తం గర్వపడుతుందని పేర్కొన్నారు.

ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు రావడంతో ఆ చిత్రయూనిట్ ఆనందానికి అవధుల్లేవు. దీనిపై యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్పందిస్తూ.. ఆస్కార్ రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. నాటునాటు పాటకు అవార్డు రావడం ఎమోషనల్ మూమెంట్ అని అన్నారు. 'ఆర్ఆర్ఆర్' సినిమా ఇండియాకు ప్రాతినిథ్యం వహించిందని చెప్పారు. 'కంగ్రాచ్యులేషన్స్ కీరవాణి సర్ జీ, జక్కన్న (రాజమౌళి), చంద్రబోస్ గారు' అని ఎన్టీఆర్ ట్వీట్ చేశారు.


Tags:    

Similar News