పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన కాజల్

జనవరి 8న తాను గర్భవతినని ప్రకటించిన కాజల్.. అప్పట్నుంచి అందుకు సంబంధించి అనేక..;

Update: 2022-04-19 13:17 GMT
పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన కాజల్
  • whatsapp icon

సినీ నటి కాజల్ అగర్వాల్ తల్లయింది. నేడు పండంటి మగబిడ్డకు కాజల్ జన్మనిచ్చింది. వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూని కాజల్ పెళ్లాడింది. 2020 కరోనా లాక్ డౌన్ సమయంలో వీరి వివాహం జరిగింది. జనవరి 8న తాను గర్భవతినని ప్రకటించిన కాజల్.. అప్పట్నుంచి అందుకు సంబంధించి అనేక మధురానుభూతులను అభిమానులతో పంచుకుంది.

బేబీ బంప్, బేబీ షవర్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. తాజాగా తమకు కొడుకు పుట్టాడని కాజల్ ప్రకటించడంతో.. ఆమె అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బుల్లి యువరాజు పుట్టాడంటూ సోషల్ మీడియాలో కాజల్ దంపతులకు నెటిజన్లు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.


Tags:    

Similar News