పునీత్ రాజ్ కుమార్.. గొప్ప వ్యక్తి. స్టార్ హీరోగా వెలుగొందుతూ గుప్తదానాలు మరెన్నో చేశారు. ఆయన చనిపోయే వరకూ ఈ విషయాలు బయటకు రాలేదు. ఇటీవలే పునీత్ రాజ్ కుమార్ కు కర్ణాటక రత్న అవార్డుతో కర్ణాటక ప్రభుత్వం సత్కరించింది. అయితే పునీత్ రాజ్ కుమార్ మరణించిన తర్వాత ఆయన జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేర్చాలని పలువురు అభిమానులు డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే బెంగళూరు యూనివర్సిటీ బీకాం సిలబస్ లోని వాణిజ్య కన్నడ 3 అనే పాఠ్యపుస్తకంలో పునీత్ రాజ్ కుమార్ జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేయడం విశేషం.
అప్పు సినిమాతో కన్నడ చిత్ర పరిశ్రమలో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత స్టార్ హీరో అయ్యాడు. ఎన్నో సామజిక కార్యక్రమాలను కూడా చేపట్టారు. 45 ఉచిత పాఠశాలలు, 26 అనాథాశ్రమాలు, 16 వృద్ధాశ్రమాలు, 19 గోశాలల, 1800 మంది విద్యార్ధులకి ఉచిత విద్యను అందించి తన గొప్ప మనసును చాటుకున్నాడు. చాలా మందికి ఈ విషయమే తెలీదు. గుప్తదానాలను ఎన్నో చేశారు. అందుకే ఆయనంటే కన్నడ ప్రజలకు అంత ఇష్టం. 29 అక్టోబర్ 2021న ఆయన మనల్నందరినీ వదిలి వెళ్లిపోయారు.