Prabhas : స్పిరిట్ వేగంగా చిత్రీకరణ పూర్తవుతుందా? తాజా కబురు ఏంటంటే?
తొలిసారి ప్రభాస్ తో సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పిరిట్ మూవీపై ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు;

డార్లింగ్ ప్రభాస్ మూవీ అప్ డేట్ అంటే ఎవరికి మాత్రం ఆసక్తి ఉండదు. ప్రభాస్ మూవీ అప్ డేట్ కోసం లక్షలాది మంది అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తారు. అందులోనూ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ తో రూపొందించిన మూవీ అప్ డేట్ అంటే ఇక మరీ చెవులు రిక్కించుకుని మరీ వింటారు. గంతులేస్తారు. అర్జున్ రెడ్డి, యానిమల్ మూవీ లతో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ తో తీస్తున్న మూవీ పై ఎంతో హైప్ ఇప్పటికే క్రియేట్ అయింది.
మరో్ బ్లాక్ బస్టర్ అంటూ...
ఎంతగా అంటే డార్లింగ్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ పడటం ఖాయం అన్నంతగా ప్రచారం ఇప్పటికే జరిగిపోయింది. ఒకవైపు సక్సెస్ ఫుల్ డైరెక్టర్, మరొకవైపు రెబల్ స్టార్ ప్రభాస్.. ఈ ఇద్దరి కాంబినేషన్ లో వస్తున్న మూవీకి బజ్ మామూలుగా ఉండదు. తొలిసారి ప్రభాస్ తో సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీపై ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కథతో పాటు కథనం.. క్లైమాక్స్ వంటివి అదిరిపోతాయన్న నమ్మకంతో ఉన్నారు. థియేటర్లు కొన్నాళ్లపాటు ఊగిపోవడం ఖాయమన్న అభిప్రాయం చిత్ర పరిశ్రమలోనూ వ్యక్తమవుతుంది.
తాజా అప్ డేట్...
అలాంటి ఈ సినిమా కు సంబంధించిన అప్ డేట్ వచ్చేసింది. ఇందులో ప్రభాస్ పవర్ ఫుల్ పోలీస్ గా నటిస్తున్నారంటున్నారు. దీనికి స్పిరిట్ అని పేరుపెట్టారు. నిజంగా స్పిరిట్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంటుందని అందరూ అనుకుంటున్న సమయంలో జూన్ నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుందని ప్రచారం ఊపందుకుంది. ఈ మేరకు నెట్టింట ఇప్పటికే అనేక వార్తలు కనిపిస్తుండటంతో డార్లింగ్ అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. థ్రిల్లర్ కథనంతో అందరినీ అలరించే ఈ మూవీ అప్ డేట్ కోసం నిత్యం ఎదురు చూసే ఫ్యాన్స్ కు జూన్ నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుందని తెలియగానే తెగ సంతోషపడిపోతున్నారు.