ప్రస్తుతం బాలకృష్ణ - క్రిష్ కాంబోలో క్రేజీ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న ఎన్టీఆర్ బయోపిక్ మీద భారీ అంచనాలే ఉన్నాయి. కథానాయకుడు, మహానాయకుడుగా రెండు పార్ట్ లుగా తెరకెక్కుతున్న ఈ సినిమాలు రెండు వారాల గ్యాప్ తో ప్రేక్షకులను పలకరించబోతున్నాయి. దర్శకుడు క్రిష్ ఈ సినిమాని శరవేగంగా కంప్లీట్ చేస్తున్నాడు. ఇప్పటికే కథానాయకుడు నుండి బయటకొచ్చిన ఎన్టీఆర్ బయోపిక్ పోస్టర్స్ అందరినీ అమితంగా ఆకర్షించాయి. ఏఎన్నార్, చంద్రబాబు, దగ్గుబాటి వెంకటేశ్వర రావు , శ్రీదేవి పాత్రలు పోషిస్తున్న నటీనటుల ఫొటోస్ వైరల్ అయ్యాయి. ఎన్టీఆర్ కి అతి దగ్గరగా ఉన్న వ్యక్తులను ఎవరిని వదలకుండా చూపెడుతున్నారారు. ఎన్టీఆర్ కి ఆప్త మిత్రుడు, అలాగే రాజకీయాల్లోకి ప్రవేశించినప్పుడు ఇద్దరి మధ్య విభేదాలు వచ్చిన కృష్ణ పాత్రను ఎవరు పోషిస్తారు అనే ఆసక్తి అందరిలో నెలకొంది. ప్రస్తుతం కథానాయకుడు షూటింగ్ ఒక కొలిక్కి వచ్చిందని.. కానీ కృష్ణ పాత్రకు సంబంధించిన షూటింగ్ మినహా మిగతా షూటింగ్ కంప్లీట్ అయ్యిందని చెబుతున్నారు.
మహేష్ చేయకపోతే...
అయితే కృష్ణ పాత్ర కోసం బాలకృష్ణ స్వయంగా కృష్ణ కొడుకు మహేష్ కి ఫోన్ చేసి మరీ అడిగినట్లుగా వార్తలొచ్చాయి. కృష్ణ పాత్ర లేకుండా ఎన్టీఆర్ బయోపిక్‌ని వదలడానికి బాలకృష్ణకు సైతం మనసు రావడం లేదట. అయితే మహేష్ మాత్రం తన నిర్ణయం చెప్పకుండా హోల్డ్ లో పెట్టడంతో..మహేష్ కోసం ఇప్పటికి ఎన్టీఆర్ టీం ఎదురు చూస్తూనే ఉందట. మరి ఒకవేళ మహేష్ గనక కృష్ణ పాత్ర చెయ్యకపోతే... కృష్ణ అల్లుడు సుధీర్ బాబు ఎమైనా కృష్ణ పాత్రలో మెరుస్తాడా..? అనే అనుమానాలున్నాయి ప్రేక్షకుల్లో. కానీ మహేష్ అయితేనే కృష్ణ క్యారెక్టర్ కి న్యాయం చేస్తాడని.. ఎన్టీఆర్ చిత్ర బృందం ఆలోచన. కానీ మహేష్ చేస్తాడనే గ్యారెంటీ లేదు. అయితే మహేష్ గనక నో చెబితే కృష్ణ పాత్ర లేకుండానే ఎన్టీఆర్ బయోపిక్ ఉండబోతుందనే ఒక వార్త ఫిలిం సర్కిల్స్ ని చుట్టేస్తోంది.