MAHESH FOUNDATION : బుర్రిపాలెం గవర్నమెంట్ స్కూల్లో డిజిటల్ లెర్నింగ్
మహేశ్ తన ఫౌండేషన్ నుంచి మరో మంచి పనికి శ్రీకారం చుట్టారు. దత్తత గ్రామమైన బుర్రిపాలెం గ్రామంలోని ..
సూపర్ స్టార్ మహేశ్ బాబు.. సినిమాల్లోనే కాదు.. నిజజీవితంలోనూ సూపర్ స్టార్ అనిపించుకునేలా మహేశ్ బాబు ఫౌండేషన్ ద్వారా ఎన్నో మంచి పనులు, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఫౌండేషన్ ద్వారా ఎంతో మంది పేద పిల్లలకి ఉచితంగా హార్ట్ ఆపరేషన్స్ చేయిస్తున్నారన్న విషయం అందరికీ తెలిసిందే. అంతేకాకుండా రెండు గ్రామాలను దత్తత తీసుకుని.. ఆ గ్రామాల్లో సేవా కార్యక్రమాలు, ఫ్రీ మెడికల్ క్యాంపులు నిర్వహించారు.
తాజాగా.. మహేశ్ తన ఫౌండేషన్ నుంచి మరో మంచి పనికి శ్రీకారం చుట్టారు. దత్తత గ్రామమైన బుర్రిపాలెం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో అన్ని సౌకర్యాలని అమర్చారు. తాజాగా అక్కడి పిల్లలకి కంప్యూటర్ క్లాసులు, డిజిటల్ లెర్నింగ్ కోసం కంప్యూటర్లు ఏర్పాటు చేశారు. బుర్రిపాలెం గవర్నమెంట్ స్కూల్ లో కంప్యూటర్లు ఏర్పాటు చేసి, వారికి డిజిటల్ లెర్నింగ్ ఇస్తున్న ఫోటోలని నమ్రత శిరోద్కర్ తన సోషల్ మీడియాలో షేర్ చేసి.. "మహేష్ బాబు ఫౌండేషన్ మరో మంచిపనికి శ్రీకారం చుట్టింది. ఒక అడుగు ముందుకేసి బుర్రిపాలెం స్కూల్ లో విద్యార్థులు కోసం డిజిటల్ లెర్నింగ్ కి కంప్యూటర్లు ఏర్పాటు చేసింది. ఇది చాలా గొప్ప రోజు" అని పోస్ట్ చేశారు.