మంచు విష్ణు.. ఆ విషయాన్ని లైట్ గా అయితే తీసుకోలేదు

ట్రోల్స్‌కు సంబంధించి 18 యూట్యూబ్ చానళ్లపై కేసులు పెడుతున్నట్టుగా తెలిపారు. వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి

Update: 2022-09-29 13:36 GMT

ప్రముఖ సినీ నటుడు, మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు తనపై ట్రోల్స్ చేయిస్తున్న వారిని సీరియస్ గా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. కొద్దిరోజుల కిందటే ఓ స్టార్ హీరో కావాలనే ఉద్యోగులను పెట్టుకుని మరీ ట్రోల్స్ చేయిస్తున్నాడని ఆరోపించిన మంచు విష్ణు.. మరోసారి కూడా అదే తరహా వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు మంచు విష్ణును కావాలనే టార్గెట్ చేసే ఎన్నో పోస్టులను చూస్తుంటాం. ముఖ్యంగా మంచు ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ ఉంటారు. అయితే తాజాగా ఓ హీరో ఆఫీసు నుంచే తనపై ట్రోల్స్ జరుగుతున్నాయని.. తన కుటుంబంపై పెయిడ్ క్యాంపెయిన్ చేయిస్తున్నారని ఆరోపించారు. తన తాజా చిత్రం జిన్నా ప్రమోషన్స్‌ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ట్రోల్స్ చేస్తున్నవారిపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్టుగా చెప్పారు. తమకు రెండు ఐపీ అడ్రస్‌లు రావడం జరిగిందని.. ఇక్కడి నుంచి పెయిడ్ బ్యాచ్ పనిచేస్తుందని ఆరోపించారు.

ట్రోల్స్‌కు సంబంధించి 18 యూట్యూబ్ చానళ్లపై కేసులు పెడుతున్నట్టుగా తెలిపారు. వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి తనపై ట్రోల్స్ చేస్తున్నారని.. ఇవన్నీ పోలీసులు చెబితే తనకు తెలిసిందన్నారు. ఇన్ని డబ్బులు పెట్టి తనమీద పెయిడ్ ట్రోల్స్ చేస్తున్నారంటే నవ్వు తెప్పిస్తుందని అన్నారు. వాళ్ల పేర్లు బయటకు వస్తే పరువు పోతుందని అన్నారు. గతంలో సినీ పరిశ్రమంతా ఒక కుటుంబంలా ఉండేదని.. సాధారణంగా తాను ట్రోల్స్‌ను పట్టించుకోనని మంచు విష్ణు చెప్పారు. జవాబుదారీతనం కోసమే కేసులు పెడుతున్నట్టుగా తెలిపారు.
ఇక జిన్నా సినిమా అక్టోబర్ 5వ తేదీన విడుదలవుతుందని భావించగా.. ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో క్లారిటీ ఇవ్వడం కోసం మంచు విష్ణు ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేశారు. సినిమా ట్రైలర్ ను అక్టోబర్ 5వ రిలీజ్ చేస్తాము. 21వ తేదీన సినిమా రిలీజ్ అవుతుందని చెప్పుకొచ్చారు. ఈ రోజు నుంచి ఈ సినిమా ప్రమోషన్స్ స్పీడ్ పెంచుతున్నామని ఆయన చెప్పుకొచ్చారు. జి. నాగేశ్వర రెడ్డి మూలకథను అందించిన ఈ సినిమాకి కోన వెంకట్ స్క్రీన్ ప్లేను అందించారు. విష్ణు సరసన నాయికలుగా సన్నీ లియోన్, పాయల్ రాజ్ పుత్ కనిపించనున్నారు. హారర్ కామెడీ జానర్ లో ఈ సినిమా ఉండనుంది.


Tags:    

Similar News