నా లావే నన్ను బ్రేక్ తీసుకునేలా చేసింది!!
నారా రోహిత్ సినిమాల్లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చినప్పుడు వీడేం హీరోరా అనుకున్నారు. అవును మరి. హీరోలకుండే ఫిజిక్ కానీ, ఆక్టివ్ నెస్ కానీ నారా రోహిత్ లో [more]
నారా రోహిత్ సినిమాల్లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చినప్పుడు వీడేం హీరోరా అనుకున్నారు. అవును మరి. హీరోలకుండే ఫిజిక్ కానీ, ఆక్టివ్ నెస్ కానీ నారా రోహిత్ లో [more]
నారా రోహిత్ సినిమాల్లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చినప్పుడు వీడేం హీరోరా అనుకున్నారు. అవును మరి. హీరోలకుండే ఫిజిక్ కానీ, ఆక్టివ్ నెస్ కానీ నారా రోహిత్ లో లేవు. కానీ నారా రోహిత్ మాత్రం వరసబెట్టి సినిమాలు చేస్తుండేవాడు. క్షణం గ్యాప్ లేకుండా సినిమా షూటింగ్ కి హాజరయ్యే నారా రోహిత్ వీరభోగ వసంతరాయులు తర్వాత మళ్ళీ సినిమాల్లో కనబడలేదు. దాదపుగా ఒక ఏడాది నుండి నారా రోహిత్ సినిమా రావడం కానీ.. మొదలెట్టడం కానీ చెయ్యలేదు. అయితే తాజాగా నారా రోహిత్ ట్విట్టర్ ఎంట్రీ ఇవ్వడం.. ఓ లుక్ పోస్ట్ చెయ్యడంతో మల్లి నారా రోహిత్ సినిమాల్లోకి రీ ఏంటి ఇవ్వబోతున్నాడనేది స్పషమైంది. అలాగే ఆయన ఫ్రెండ్ శ్రీవిష్ణు కూడా రోహిత్ రీ ఎంట్రీ కన్ఫర్మ్ చేసాడు.
తాజాగా నారా రోహిత్ లుక్ చూసిన అందరూ షాకయ్యారు. అంత సన్నగా లుక్ పరంగా కాస్త స్టైలిష్ గా కనబడ్డాడు. అయితే తాజాగా నా బరువే నన్ను సినిమాలకు ఏడాది గ్యాప్ తీసుకునేలా చేసింది అంటున్నాడు. ఒకప్పటి నా లుక్ నాకే నచ్చేది కాదు… అందుకే సినిమాలకు బ్రేక్ తీసుకుని.. ఫిట్నెస్ విషయంలో రెండేళ్ళనుండి కష్టపడుతున్నాను. అందులో భాగంగానే కాస్త సన్నబడి.. ఇలా కొత్త లుక్ కి వచ్చాను. ఇక సినిమాలకు అస్సలు గ్యాప్ రానివ్వను. కరోనా లాక్ డౌన్ ముగియగానే రెండు భారీ ప్రాజెక్ట్స్ అనౌన్సమెంట్స్ తో మీకు సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను అని అంటున్నాడు.