కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ నుంచి.. సల్మాన్ లుంగీ సాంగ్ : చరణ్ మాస్ స్టెప్పులు

తాజాగా ఈ సినిమా నుంచి సల్మాన్ లుంగీ సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ వీడియో సాంగ్ లో సల్మాన్, వెంకీ, రామ్ చరణ్ ఒకే..;

Update: 2023-04-04 09:03 GMT
kisi ka bhai kisi ki jaan, ram charan venkatesh salman song

kisi ka bhai kisi ki jaan

  • whatsapp icon

బాలీవుడ్ స్టార్ హీరో, కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తోన్న తాజా సినిమా కిసీకా భాయ్ కిసీకా జాన్. తమిళంలో సూపర్ హిట్ అయిన వీరం సినిమాకు బాలీవుడ్ లో రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇదే సినిమాను తెలుగులో పవన్ కల్యాణ్ కాటమరాయుడు పేరుతో రీమేక్ చేశాడు. ఇది పూర్తిగా బాలీవుడ్ సినిమానే అయినా.. ప్రధాన పాత్రల్లో టాలీవుడ్ స్టార్ కనిపించనున్నారు. విక్టరీ వెంకటేష్, పూజా హెగ్డే, జగపతి బాబు నటిస్తోన్న కిసీకా భాయ్ కిసీకా జాన్ లో రామ్ చరణ్ ఓ పాటలో గెస్ట్ గా కనిపించనున్నారు.

తాజాగా ఈ సినిమా నుంచి సల్మాన్ లుంగీ సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ వీడియో సాంగ్ లో సల్మాన్, వెంకీ, రామ్ చరణ్ ఒకే రకమైన డ్రస్ లో మాస్ స్టెప్పులతో ఫ్యాన్స్ ను ఉర్రూతలూగించారు. ఇక ముగ్గురు సూపర్ స్టార్స్ ని ఒకే ఫ్రేమ్ లో చూస్తుంటే.. రేపు థియేటర్‌లు ఈ సాంగ్ కి దద్దరిల్లిపోవడం ఖాయం అన్నట్లుంది. ఈ పాట షూటింగ్ మొత్తం ఆచార్య సినిమా కోసం వేసిన టెంపుల్ సెట్ లో జరిగింది. కాటమరాయుడు సినిమాలో పవన్ కల్యాణ్ శృతిహాసన్ కోసం వాళ్ల ఊరికి వచ్చినట్టే.. పూజాహెగ్డే కోసం సల్మాన్ ఖాన్ తెలంగాణలోని ఒక ఊరుకి వస్తాడు. తెలంగాణ నేటివిటీని చూపిస్తూ ఈ సినిమాని తెరకెక్కించారు. ఈ క్రమంలోనే బతుకమ్మ సంప్రదాయాన్ని చూపిస్తూ ఒక సాంగ్ ని కూడా చిత్రీకరించారు. ఏప్రిల్ 21న ఈ సినిమా విడుదల కానుంది.
Full View



Tags:    

Similar News