ఫిక్స్ అయిపోండి!!

మార్చ్ 20 న మూతబడిన థియేటర్స్ ఇదిగో తెరుచుకుంటాయి.. అదిగో తెరుచుకుంటాయి అని అనుకోవడమే కానీ… ఆగష్టు లోను థియేటర్స్ తెరుస్తారంటే నమ్మలేకుండా ఉంది కరోనా ఉధృతి. [more]

Update: 2020-07-26 04:01 GMT

మార్చ్ 20 న మూతబడిన థియేటర్స్ ఇదిగో తెరుచుకుంటాయి.. అదిగో తెరుచుకుంటాయి అని అనుకోవడమే కానీ… ఆగష్టు లోను థియేటర్స్ తెరుస్తారంటే నమ్మలేకుండా ఉంది కరోనా ఉధృతి. కరోనా రోజు రోజుకి జడల మర్రిలా పెరుగుతుంది కానీ తగ్గడం లేదు. అయితే చాలా సినిమాలు కరోనా లేకపోతె ఏప్రిల్ లో విడుదల కావాల్సినవి. కాని కరోనా తో రెడ్, వి, ఉప్పెన, నిశ్శబ్దం లాంటి సినిమాలు పోస్ట్ ప్రొడక్షన్ తో సహా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఉన్నాయి. కానీ థియేటర్స్ తెరిచే సూచనలు కనిపించడం లేదు. ఓటిటి వారు ఉప్పెన, రెడ్, నిశ్శబ్దం, వి లాంటి క్రేజ్ ఉన్న సినిమాలకు మంచి ఆఫర్స్ ఇస్తున్న హీరోలు నిర్మాతలను పడనియ్యడం లేదు. తమ క్రేజ్ తగ్గుతుంది అని.. ఎప్పటికైనా థియేటర్ లోనే మా సినిమా అంటూ కట్టకట్టుకుని కూర్చున్నారు.

ప్రస్తుతం కరోనా పరిస్థితిలో థియేటర్స్ తెరిచినా థియేటర్స్ కి ప్రేక్షకులు రారు. ఇది ఫిక్స్. ఎందుకంటే కరోనా ఇప్పుడు మహమ్మారిలా మారింది. మార్చి లో ఉన్న కేసులకు పదింతలేమిటి ఇంకా భీబత్సంగా పెరిగిపోయాయి. అందుకే థియేటర్స్ తెరిచినా ప్రేక్షకులు రారు. అందుకే ఇప్పుడు వి, రెడ్, నిశ్శబ్దం, ఉప్పెన సినిమాలు అన్ని ఓటిటికి  దారి పడితే మంచిది. లేదంటే సినిమాలకు క్రేజ్ పోయి.. థియేటర్స్ లో విడుదలైన చూసే నాధుడు ఉండదు. అదే ఇప్పుడైతే గనక ఓటిటిలో మంచి క్రేజ్ ఉంది. దాన్ని హీరోలంతా గుర్తించాలని ప్రేక్షకుల మనవి. కానీ నాని, రామ్, అనుష్క, వైష్ణవ తేజ్, లాంటి వాళ్ళు మాత్రం దిగొచ్చేలా లేరు. ఇక కొద్దిగా షూటింగ్ మిగిలిన సినిమాలు క్రాక్, వకీల్ సాబ్, సోలో బ్రతుకే సో బెటరు సినిమాలు కూడా లాక్ కరోనా తగ్గగానే షూటింగ్ ఫినిష్ చేసుకుని ఓటిటి బాట పట్టినా ఆశ్చర్యం లేదంటున్నాయి ట్రేడ్ వర్గాలు.

Tags:    

Similar News