అలాంటి ట్రోలింగ్ వలన నా పేరెంట్స్ ఫీలవుతారు?

టాలీవుడ్ లో డ్రగ్స్ ఆరోపణలు ఎదుర్కుంటూ తనని మీడియా వేధింపులకు గురి చేస్తుందంటూ కోర్టుకెక్కిన రకుల్ ప్రీత్ సింగ్.. డ్రగ్స్ కేసులో కోర్టుకెళ్లి.. ఎవరికీ కనబడకుండా ముఖ్యంగా [more]

Update: 2020-09-21 06:35 GMT

టాలీవుడ్ లో డ్రగ్స్ ఆరోపణలు ఎదుర్కుంటూ తనని మీడియా వేధింపులకు గురి చేస్తుందంటూ కోర్టుకెక్కిన రకుల్ ప్రీత్ సింగ్.. డ్రగ్స్ కేసులో కోర్టుకెళ్లి.. ఎవరికీ కనబడకుండా ముఖ్యంగా మీడియా కంటపడకుండా తన షూటింగ్ ఏదో తానూ చేసుకుంటుంది. అయితే తాజాగా రకుల్ పై వస్తున్నా నెగెటివ్ ట్రోలింగ్స్ ని రకుల్ ప్రీత్ అంతగా పట్టించుకోదట. కానీ తనపై వచ్చే నెగెటివ్ ట్రోల్స్ చూసినప్పుడు తన పేరెంట్స్ చాలా బాధపడుతుంటారని చెబుతుంది. ఇక తనకు ఎప్పుడూ లైంగిక వేధింపులు సినిమా ఇండస్ట్రీలో ఎదురు కాలేదని.. నేను ఎప్పటికి అదే మాటకి కట్టుబడి ఉంటానంటుంది.

అయితే అన్ని పరిశ్రమల మాదిరిలాగానే సినిమా పరిశ్రమలోనూ మీ టూ ఉందని.. తన కో స్టార్స్ అలాంటివి ఫేస్ చేశారంటున్న రకుల్.. తనకి అలాంటి వేధింఫులు ఎదురు కాకపోవడానికి కారణాం తాను ఒకేసారి పెద్ద స్టార్స్ లో నటించలేదని.. అలాగే భారీ ప్రాజెక్ట్స్ నుండి ఛాన్స్ లు కూడా రాలేదని..నేను మొదట చాలా చిన్న హీరోలతో చేశా అని.. వేంకటాద్రి ఎక్స్ప్రెస్ హిట్ అవడం తనకి కలిసొచ్చినా.. ఏడెనిమిది సినిమాలు చేశాకే నాకు రామ్ చరణ్ తో బ్రుస్ లి అవకాశం వచ్చింది అని, అలాగే ఎన్టీఆర్, అల్లు అర్జున్ , మహేష్ సినిమాలు కూడా నాకు త్వరగా రాలేదని.. ఒక్కో మెట్టెక్కుతూ నేను ఎదిగాను కాబట్టే నాకు లైంగిక వేధింపులు ఎదురు కాలేదంటుంది రకుల్ ప్రీత్.

Tags:    

Similar News