వీడియో కాల్ ద్వారా క్షమాపణలు చెప్పిన రామ్‌చరణ్..

ఇటీవల ఇటలీ వెళ్లిన రామ్ చరణ్.. అక్కడి నుంచి వీడియో కాల్ ద్వారా ఇక్కడి దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న వారితో మాట్లాడాడు.

Update: 2023-10-23 12:15 GMT

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఇటీవల ఉపాసనతో కలిసి ఇటలీ వెళ్లిన సంగతి తెలిసిందే. తమ కూతురు 'క్లీంకార', ఫేవరెట్ పెట్ 'రైమ్‌'తో పాటు పలువురు కుటుంబసభ్యులతో మెగా జంట ప్రత్యేక విమానంలో ఇటలీ వెళ్లారు. ఇక అక్కడి విషయాలను ఉపాసన సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ వస్తున్నారు.

ఇది ఇలా ఉంటే, రామ్ చరణ్ అక్కడి నుంచి వీడియో కాల్ ద్వారా ఇక్కడి దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న వారితో మాట్లాడాడు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. ఆ వీడియోలో రామ్ చరణ్ తన క్షమాపణలు తెలియజేశాడు. ఇంతకీ చరణ్ ఎవరితో మాట్లాడాడు..? ఎందుకు సారీ చెప్పాడు..?
ఇటీవల ఢిల్లీలోని జర్మన్ అంబాసడర్ కార్యాలయంలో 'జర్మన్ యూనిటీ డే' సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి. ఇక ఈ ఈవెంట్ కి రాజకీయ ప్రముఖలతో పాటు దేశంలోని ఫేమస్ పర్సన్స్ కూడా హాజరయ్యారు. ఈక్రమంలోనే టాలీవుడ్ నుంచి.. ఆస్కార్ మరియు నేషనల్ అవార్డు విన్నర్ ఎం ఎం కీరవాణి ముఖ్య అతిథిగా వెళ్లారు. ఇక ఈ ఈవెంట్ కి రామ్ చరణ్ కూడా వెళ్లాల్సి ఉంది. కానీ ఇటలీ ప్రోగ్రాం వలన చరణ్.. ఆ కార్యక్రమానికి వెళ్లలేకపోయాడు.
అయితే వీడియో కాల్ ద్వారా ఆ ఈవెంట్ లో ప్రత్యేక్షమయ్యాడు. ఆ వీడియోలో రామ్ చరణ్ మాట్లాడుతూ.. "నన్ను ఈ ఈవెంట్ కి ఆహ్వానించినందుకు థాంక్యూ. కానీ నేను రాలేకపోయాను క్షమించండి. ముందుగా ఫిక్స్ చేసుకున్న నా వ్యక్తిగత పర్యటన కారణంగా కుదరలేదు" అంటూ పేర్కొన్నాడు. అలాగే ఆ ఈవెంట్ లో కనిపించిన తన కట్ అవుట్స్ ఎంతో ఆనందాన్ని ఇచ్చినట్లు చరణ్ వీడియో కాల్ లో చెప్పుకొచ్చాడు.
మళ్ళీ అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా అందర్నీ కలుస్తాను అంటూ జర్మన్ అధికారులకు రామ్ చరణ్ తెలియజేశాడు. ఇక ఈవెంట్ లో జర్మన్ అంబాసడర్స్ నాటు నాటు సాంగ్ కి డాన్స్ వేసి ఎంజాయ్ చేయడం, కీరవాణి స్టేజి పై జర్మన్ భాషలో పాట పాడి అందర్నీ ఖుషి చేయడం జరిగింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.


Tags:    

Similar News