రమ్యకృష్ణ కాల్షీట్ యమా కాస్ట్లీ గురూ!!
ఒకప్పుడు హీరోయిన్ గా పదేళ్లకి పైగానే దున్నేసిన రమ్యకృష్ణ తమిళంలోనూ నెగెటివ్ కేరెక్టర్ లో ఇరగదీసింది. రజినీకాంత్ నరసింహాలో విలన్ గా రమ్యకృష్ణ పెరఫార్మెన్స్ ఆమె ఫాన్స్ [more]
ఒకప్పుడు హీరోయిన్ గా పదేళ్లకి పైగానే దున్నేసిన రమ్యకృష్ణ తమిళంలోనూ నెగెటివ్ కేరెక్టర్ లో ఇరగదీసింది. రజినీకాంత్ నరసింహాలో విలన్ గా రమ్యకృష్ణ పెరఫార్మెన్స్ ఆమె ఫాన్స్ [more]
ఒకప్పుడు హీరోయిన్ గా పదేళ్లకి పైగానే దున్నేసిన రమ్యకృష్ణ తమిళంలోనూ నెగెటివ్ కేరెక్టర్ లో ఇరగదీసింది. రజినీకాంత్ నరసింహాలో విలన్ గా రమ్యకృష్ణ పెరఫార్మెన్స్ ఆమె ఫాన్స్ కాదు ప్రేక్షకులు ఎప్పటికి మరిచిపోలేరు. అలాంటి రమ్యకృష్ణ కి రాజమౌళి సెకండ్ ఇన్నింగ్స్ లో మంచి ఛాన్స్ ఇచ్చాడు. బాహుబలిలో రాజమాతగా రమ్యకృష్ణ కెరీర్ ని టర్న్ చేసాడు. శివగామిగా రమ్యకృష్ణ అదరగొట్టెయ్యడమే కాదు.. ఆ క్రేజ్ తో సెకండ్ ఇన్నింగ్స్ లోను హీరోయిన్స్ సంపాదించే అంత సంపాదిస్తుంది. ప్రస్తుతం రమ్యకృష్ణ ని తమ సినిమాలో తీసుకోవాలంటే నిర్మాతలకు తడిచిపోవడం ఖాయమట.
అంటే రమ్యకృష్ణ కాల్షీట్ కావాలంటే యమా కాస్ట్లీ గురూ అంటున్నారట. అంటే రమ్యకృష్ణ ఒక్కో రోజు కాల్ షీట్ విలువ 10 లక్షలట. ఒక్కరోజుకి రమ్యకృష్ణ 10 లక్షల డిమాండ్ చేస్తుందట. మొత్తం పది రోజుల కాల్షీట్స్ అంటే కోటి పట్టుకుపోతుందన్నమాట. రమ్యకృష్ణ ని తమ సినిమాల్లో బుక్ చేసుకోవాలంటే రోజుకి పది లక్షలు పొయ్యాల్సిందే. ప్రస్తుతం భర్త డైరెక్ట్ చేస్తున్న రంగమార్తాండ సినిమాలోనూ, పూరి జగన్నాధ్ ఫైటర్ సినిమాలో ఓ కీలక పాత్రలోనూ రమ్యకృష్ణ నటిస్తుంది. మరి 50 ఏళ్ళొచ్చినా ఇప్పటికి వన్నెతరగని అందాన్ని మైంటైన్ చేస్తున్న రమ్యకృష్ణ కాల్షీట్ యమా కాస్ట్లీ గురూ అనాల్సిందే మరి.