కొడుకులకు పాఠాలు చెబుతున్న స్టార్ హీరో?

ఇండస్ట్రీలోని సినిమా కుటుంబంలోని పిల్లలకి తెలుగు పెద్దగా రాదు. ఇప్పుడు మహేష్ కూతురు సితార తెలుగు కన్నా ఇంగ్లీష్ చించేస్తుంది. ఇక అల్లు అర్జున్ కూతురు తెలుగు [more]

Update: 2020-06-19 09:26 GMT

ఇండస్ట్రీలోని సినిమా కుటుంబంలోని పిల్లలకి తెలుగు పెద్దగా రాదు. ఇప్పుడు మహేష్ కూతురు సితార తెలుగు కన్నా ఇంగ్లీష్ చించేస్తుంది. ఇక అల్లు అర్జున్ కూతురు తెలుగు బాగానే మాట్లాడుతుంది. అయితే వీరంతా అమెరికన్ ఇంగ్లీష్ లో ఇరగదీసేస్తారు. కానీ తెలుగు మాత్రం కాస్త పట్టి పట్టి మాట్లాడుతుంటారు. అయితే తాజాగా టాలీవుడ్ స్టార్ హీరో ఒకరు తన కొడుకులిద్దరికి తెలుగులో పాఠాలు చెబుతున్నాడట. కరోనా లాక్ డౌన్ తో ఇంటికే పరిమితమైన హీరోలంతా ఫ్యామిలితోను, పిలలతోను హాయిగా గడిపేస్తున్నట్టే.. RRR హీరో ఎన్టీఆర్ కూడా భార్య లక్ష్మి ప్రణతితో, కొడుకులు భార్గవ్ రామ్, అభయ్ రామ్ లతో ఆటలాడుతూ.. ఇంట్లో రకరకాల వంటలు ట్రై చేస్తూ టైం పాస్ చేస్తున్నాడు.

రాజమౌళి RRR షూటింగ్ షెడ్యూల్ వేసి ఎన్టీఆర్ కి కబురు పెట్టవరకు ఎన్టీఆర్ ఫ్యామిలీతోనే టైం స్పెండ్ చేస్తాడట. అయితే ఈ లాక్ డౌన్ సమయంలో కొడుకులతో ఆడుకోవడమే కాదు…. తన కొడుకులు భార్గవ్, అభయ్ లకు తెలుగులో శిక్షణనిస్తున్నాడట. కొడుకులకు తెలుగులో స్పష్టంగా మాట్లాడడం దగ్గరుండి.. రాయడం వరకు నేర్పిస్తున్నాడట. మరి ఇప్పుడు స్కూల్స్ అన్నీ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ వాళ్ళ చాలామంది పిల్లలకి తెలుగు రావడం లేదు. ఇంకా ఎన్టీఆర్ తన తాతగారైన తారకరామారావు గారి సినిమాలను కొడుకులతో కలిసి చూస్తూ ఆస్వాదిస్తున్నాడట. మరి ఎన్టీఆర్ RRR షూట్ కి పిలుపొచ్చేవరకు తన టైం మొత్తం ఫ్యామిలీకి కేటాయించాడన్నమాట.

Tags:    

Similar News