మహేష్ బాబుకు సర్జరీ.. షూటింగ్ కు విరామం

టాలీవుడ్ హీరో మహేష్ బాబు సర్జరీకి వెళ్లనున్నారు. ఆయన గతకొంత కాలంగా మోకాలి నొప్పితో బాధపడుతున్నారు

Update: 2021-12-02 04:06 GMT

టాలీవుడ్ హీరో మహేష్ బాబు సర్జరీకి వెళ్లనున్నారు. ఆయన గతకొంత కాలంగా మోకాలి నొప్పితో బాధపడుతున్నారు. మహేష్ బాబు ప్రస్తుతం సర్కారీ వారి పాట షూటింగ్ లో ఉన్నారు. నిన్న సిరివెన్నెల సీతారామ శాస్త్రికి నివాళులర్పించారు కూడా. అయితే మోకాలి నొప్పి తీవ్రం కావడంతో మహేష్ బాబు సర్జరీకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. దీంతో షూటింగ్ కు ఆయన రెండు నెలలు దూరం కావచ్చన్నది ఫిలింనగర్ వర్గాల టాక్.

సర్జరీ తర్వాత....?
అయితే మహేష్ బాబు మోకాలికి మైనర్ సర్జరీయేనని తెలుస్తోంది. సర్కారీ వారి పాట వచ్చే ఏడాది విడుదల కానుంది. షూటింగ్ కు కొంత విరామం ప్రకటించిన తర్వాత తిరిగి షూటింగ్ లో పాల్గొంటారని తెలుస్తుంది. మొత్తం మీద మహేష్ బాబు దీర్ఘకాలంగా బాధపడుతున్న మోకాలి నొప్పికి సర్జరీ చేయించుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది.


Tags:    

Similar News