తల్లి కాబోతోన్న కాజల్.. అధికారికంగా ప్రకటించిన భర్త !

ఇటీవల కాజల్ తల్లికాబోతోందంటూ వార్తలొచ్చాయి. ఈ వార్తలపై కాజల్ గానీ.. ఆమె భర్త గానీ స్పందించలేదు. కాజల్ ఒప్పుకున్న సినిమాల నుంచి తప్పుకోవడం.. చేతిలో ఉన్న

Update: 2022-01-02 08:52 GMT

టాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన కాజల్ అగర్వాల్.. గతేడాది ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూని పెళ్లాడిన విషయం తెలిసిందే. పెళ్లి తర్వాత ఈ అమ్మడు సినిమాల వేగం తగ్గించింది. తన భర్త గౌతమ్ బిజినెస్ లు చూసుకోవడంలో బిజీ అయిపోయింది. అయితే.. ఇటీవల కాజల్ తల్లికాబోతోందంటూ వార్తలొచ్చాయి. ఈ వార్తలపై కాజల్ గానీ.. ఆమె భర్త గానీ స్పందించలేదు. కాజల్ ఒప్పుకున్న సినిమాల నుంచి తప్పుకోవడం.. చేతిలో ఉన్న సినిమాలను ఫాస్ట్ గా పూర్తి చేయడం వంటి ఘటనలతో ఆమె తల్లి కాబోతోందన్న వార్తలు వైరల్ అయ్యాయి.

Also Read : సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న బాలీవుడ్ నటుడు.. ప్రశ్నిస్తున్న నెటిజన్లు !

తాజాగా ఈ విషయాన్ని కాజల్ భర్త అధికారికంగా ప్రకటించారు. నిన్న న్యూ ఇయర్ సందర్భంగా కాజల్ అగర్వాల్ ఫోటో షేర్ చేసి.. ఈ కొత్త సంవత్సరంలో నీ రాక కోసం ఎదురు చూస్తున్నామంటూ ప్రెగ్నెంట్ లేడీ ఎమోజీని జత చేశాడు గౌతమ్ కిచ్లూ. దీంతో కాజల్ తల్లి కాబోతోందని అధికారికంగా ప్రకటించారంటూ.. నెటిజన్లు ఆ పోస్ట్ ను షేర్ చేస్తున్నారు. త్వరలో తల్లిదండ్రులు కాబోతున్న ఆ దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.










Tags:    

Similar News