ఇండియా గురించి RRR తెలియజేసింది.. అమెరికా అధికారి

అమెరికన్ అంబాసడర్ 'ఎరిక్ గర్చేట్టి' RRR గురించి మాట్లాడుతూ.. అమెరికన్స్ కి ఇండియా గురించి..

Update: 2023-10-20 12:40 GMT

దర్శకధీరుడు రాజమౌళి 'RRR' సినిమాతో.. ఇండియన్ సినిమాని మాత్రమే కాదు, భారతదేశ సంప్రదాయాలు, కల్చర్, కథలను కూడా ప్రపంచం మొత్తానికి తెలియజేసేలా చేశాడు. భాషతో సంబంధం లేకుండా, సాధారణ ప్రజలు, అధికారులు.. ఇలా వరల్డ్ వైడ్ గా ప్రతి ఒక్కరి మనసు దోచుకునేలా ఆర్ఆర్ఆర్ ని రాజమౌళి తెరకెక్కించాడు. ఒక తెలుగు ప్లాక్ సాంగ్ కి ప్రపంచం మొత్తం ఉర్రూతలూగేలా చేశాడు.

కాగా ఈ సినిమా రిలీజ్ అయ్యి సంవత్సరాలు గడుస్తున్నాయి. కానీ ఈ మూవీ గురించి, నాటు నాటు పాట గురించి.. వరల్డ్ వైడ్ గా ఎక్కడో చోట వినిపిస్తూనే ఉంది. ముఖ్యంగా జాపనీస్, అమెరికన్స్ ఈ సినిమాని బాగా ఆదరించారు, ప్రేమించారు. దీంతో ఆ దేశాల్లో భారతదేశం అని మాట రాగానే RRR అనే పదం వినిపిస్తుంది. అంతలా ఆ మూవీ ప్రతి ఒక్కరికి దగ్గరైంది. తాజాగా ఈ సినిమా గురించి అమెరికన్ అంబాసడర్ ‘ఎరిక్ గర్చేట్టి’ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. "అమెరికాకి హాలీవుడ్ ఉంటే, ఇండియాకి టాలీవుడ్-బాలీవుడ్ ఉన్నాయి. అమెరికా పై భారతీయుల ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది. వారికీ ఇక్కడ కల్చర్ గురించి, విషయాలు గురించి బాగా తెలుసు. కానీ అమెరికన్స్ భారతదేశం గురించి పెద్దగా తెలియదు. అక్కడి సాంప్రదాయాలు, కల్చర్, మ్యూజిక్, మూవీస్ గురించి పెద్దగా తెలియదు. వాటన్నిటిని RRR సినిమా, నాటు నాటు సాంగ్ పరిచయం చేశాయి. ఆ కల్చర్, మ్యూజిక్ అమెరికన్స్ ని బాగా ఉత్తేజితపరిచాయి. దీంతో భారతీయ సాంప్రదాయాలు, విషయాలు పై అమెరికన్స్ కి ఎక్కువ ఆసక్తి కలిగింది" అంటూ పేర్కొన్నాడు.
ఇక ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. ఇది చూసిన టాలీవుడ్ ఆడియన్స్.. రాజమౌళికి థాంక్యూ చెబుతూ పోస్టులు పెడుతున్నారు. టాలీవుడ్‌కి, ఇండియాకి ఇంతటి గుర్తింపుని తీసుకు వచ్చినందుకు దర్శకధీరుడిని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఇక కొందరు నెటిజెన్స్.. "RRR తోనే ఈ రేంజ్ పేరుని తీసుకు వచ్చిన రాజమౌళి.. మహేష్ బాబు SSMB29తో ఇంకెంతటి పేరుని సంపాదించి పెడతాడో చూడాలి" అంటూ కామెంట్స్ చేస్తున్నారు.


Tags:    

Similar News