ఉప్పెన క్రేజ్ తో వైష్ణవ తేజ్ నెక్స్ట్ హాట్ కేక్!

వైష్ణవ తేజ్ హీరోగా అరంగేట్రం చేసిన ఉప్పెన సినిమా అతిపెద్ద హిట్ మూవీగా నిలిచింది. నిన్నటి వరకు ఉప్పెన సినిమా కాలక్షన్స్ జోరుని ఏ సినిమా కూడా [more]

Update: 2021-02-26 13:42 GMT

వైష్ణవ తేజ్ హీరోగా అరంగేట్రం చేసిన ఉప్పెన సినిమా అతిపెద్ద హిట్ మూవీగా నిలిచింది. నిన్నటి వరకు ఉప్పెన సినిమా కాలక్షన్స్ జోరుని ఏ సినిమా కూడా అడ్డుకట్ట వెయ్యలేకపోయింది. అల్లరి నరేష్ నాంది సినిమా సూపర్ హిట్ అయినా.. ఉప్పెన కలెక్షన్స్ ఆపలేకపోయింది. ఈ సినిమా హిట్ తో వైష్ణవ తేజ్ క్రేజ్ పెరిగిపోయింది. దానితో అయన నటించిన రెండో సినిమా థియేట్రికల్ రైట్స్ కి భారీ గిరాకీ ఏర్పడింది. వైష్ణవ తేజ్ ఉప్పెన రిలీజ్ కాకుండానే క్రిష్ దర్శకత్వంలో కొండపాలెం నవల ఆధారంగా తక్కువ బడ్జెట్ తో ఓ మూవీ చేసిన విషయం తెలిసిందే. ఆ సినిమాలో వైష్ణవ తేజ్ కి జోడిగా రకుల్ ప్రీత్ డీ గ్లామర్ రోల్ లో నటించింది.
అయితే ఉప్పెన విడుదల కాకముందు ఆ సినిమా ఓటిటికి అమ్మెయ్యబోతున్నారన్నారు. నెట్ ఫ్లిక్స్ నుండి బేరసారాలు కూడా జరిగాయి. కానీ ఉప్పెన భారీ హిట్ అవడంతో వైష్ణవ తేజ్ సెకండ్ మూవీ థియేట్రికల్ రైట్స్ ని 11 కోట్లకి లక్ష్మణ్ కొనేసాడనే టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం వైష్ణవ తేజ్ కున్న క్రేజ్ తో క్రిష్ – వైష్ణవ తేజ్ మూవీ కూడా త్వరలోనే రిలీజ్ చేసి క్యాష్ చేసుకోవాలనుకుంటున్నారు. ఉప్పెన రిలీజ్ ప్రమోషన్స్ కూడా పూర్తి కావొస్తున్నాయి. అదే ఊపులో వైష్ణవ సెకండ్ మూవీ ప్రమోషన్స్ స్టార్ట్ చేసి వేడిలో వేడి రిలీజ్ డేట్ ఇవ్వాలనే యోచనలో నిర్మాతలు ఉన్నట్టుగా తెలుస్తుంది. 

Tags:    

Similar News