Vijay Devarakonda: విజయ్ దేవర కొండ సినిమా షూటింగ్ లో ఏనుగు పెట్టిన టెన్షన్

విజయ్ దేవరకొండ కెరీర్ లో పన్నెండవ చిత్రం;

Update: 2024-10-05 09:30 GMT
VD12, VijayDevarakonda, VijaydevarakondaMovie, vijay devarakonda movie shooting latest news today,  vijay devarakonda movie shooting elephant missing Elephants wreak havoc on sets in Kerala, latest movie news telugu

vijay devarakonda 

  • whatsapp icon

విజయ్ దేవరకొండ కెరీర్ లో పన్నెండవ చిత్రం "VD12" చిత్రీకరణ కేరళలో జరుగుతూ ఉంది. కోతమంగళం సమీపంలో షూటింగ్ జరుగుతూ ఉండగా ఊహించని ఘటన చోటు చేసుకుంది. అడవిలోని బూతతంకెట్టు వద్ద నటీనటులు, ఏనుగులతో సన్నివేశాలు చిత్రీకరిస్తున్న సమయంలో రెండు ఏనుగులు ఘర్షణకు దిగాయి. ఈ ఘర్షణలో గాయపడిన ఏనుగుల్లో ఒకటి భయపడి అడవిలోకి వెళ్లింది. గాయపడిన ఏనుగును శుక్రవారం రాత్రి వరకు అటవీశాఖ అధికారులు గుర్తించలేకపోయారు. ఈ ఘటన కారణంగా సినిమా షూటింగ్‌ని తాత్కాలికంగా నిలిపివేశారు.

శుక్రవారం సినిమా షూటింగ్ సందర్భంగా మరో ఏనుగుతో ఘర్షణ జరగడంతో ఏనుగు అడవిలోకి పారిపోయింది. గాయపడిన జంతువును గుర్తించడానికి మావటి, అటవీ శాఖ అధికారులు అదే రోజు విస్తృతమైన సెర్చ్ ఆపరేషన్ ను ప్రారంభించారు. దాదాపు 15 గంటల తర్వాత ఆ ఏనుగు కనిపించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

"VD12" సినిమా విజయ్ దేవరకొండ కెరీర్ లో కీలకమైన సినిమా. ఈ సినిమా పీరియాడికల్ డ్రామా. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై నాగవంశీ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టుకు ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
Tags:    

Similar News