సీఎం జగన్ తో ముగిసిన విష్ణు భేటీ.. తిరుపతిలో సినిమా స్టూడియో !
సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సమస్యలపై చర్చించినట్లు విష్ణు చెప్పారు. త్వరలోనే ఇండస్ట్రీ సమస్యలను పరిష్కరించేలా
ఏపీ ముఖ్యమంత్రి సీఎం జగన్ మోహన్ రెడ్డితో మంచి విష్ణు భేటీ ముగిసింది. సీఎం తో భేటీ అనంతరం మంచు విష్ణు మీడియాతో మాట్లాడుతూ.. సీఎంతో భేటీలో చర్చించిన విషయాలను వెల్లడించారు. సీఎంతో జరిగిన సమావేశంలో చాలా విషయాల గురించి మాట్లాడినట్లు తెలిపారు. అయితే అవి వ్యక్తిగతమైన విషయాలని, మీడియాకు వెల్లడించలేనని తెలిపారు. అలాగే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సమస్యలపై చర్చించినట్లు విష్ణు చెప్పారు.
Also Read : సీఎం కేసీఆర్ పై పోలీసులకు ఫిర్యాదు..
త్వరలోనే ఇండస్ట్రీ సమస్యలను పరిష్కరించేలా చూస్తామని పేర్కొన్నారు. అలాగే తిరుపతిలో విష్ణు సినిమా స్టూడియోను నిర్మించనున్నట్లు చెప్పుకొచ్చారు. కాగా.. ఇటీవల ఇండస్ట్రీ పెద్దలు సీఎం జగన్ ను భేటీ అవ్వగా.. ఆ భేటీకి తన తండ్రి మోహన్ బాబు పిలువలేదన్నది పూర్తిగా దుష్ప్రచారమన్నారు. విశాఖకు ఇండస్ట్రీని ఎలా తరలించాలన్న విషయంపై ఆలోచిస్తామని మంచు విష్ణు తెలిపారు.