Yatra 2 : వైఎస్ జగన్ బర్త్‌డే కానుకగా యాత్ర 2 ఫస్ట్ లుక్..

వైఎస్ జగన్ బర్త్‌డే కానుకగా యాత్ర 2 ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.

Update: 2023-12-21 07:18 GMT

Yatra 2  first look

Yatra 2 : నేడు డిసెంబర్‌ 21న ఏపీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బర్త్ డే సందర్భంగా ప్రతి ఒక్కరు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా జగన్ కి విషెస్ తెలియజేశారు. ఇక జగన్ లైఫ్ స్టోరీ కథాంశంతో తెరకెక్కుతున్న సినిమాల నుంచి బర్త్ డే కానుకలు ఆడియన్స్ ముందుకు వచ్చాయి. ఈక్రమంలోనే యాత్ర 2 నుంచి ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు.

గత ఎన్నికల సమయంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్రని కథాంశంగా తీసుకోని దర్శకుడు మహి వి రాఘవ్ డైరెక్ట్ చేసిన 'యాత్ర' సూపర్ హిట్టుగా నిలిచింది. దీంతో దానికి సీక్వెల్ గా జగన్ మోహన్ రెడ్డి చేసిన పాద యాత్రని తీసుకు వస్తున్నారు. రాజశేఖర్ రెడ్డి పాత్రలో మమ్ముట్టి నటించగా, ఇప్పుడు జగన్ పాత్రలో తమిళ హీరో జీవ నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.

ఇక నేడు జగన్ పుట్టినరోజు కావడంతో మూవీ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. రాజశేఖర్ రెడ్డి, జగన్ పాత్రలను పోషిస్తున్న మమ్ముట్టి, జీవ.. కుర్చీల్లో కూర్చొని ఆ పోస్టర్ లో కనిపిస్తున్నారు. పోస్టర్ అయితే ఆకట్టుకునేలా ఉంది. జగన్ గా జీవ బాగా సెట్ అయ్యారంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. 2024 ఫిబ్రవరి 8న ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. త్రీ ఆటమ్‌ లీవ్స్, వీ సెల్యూలాయిడ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


Tags:    

Similar News